బలభద్రపురం ప్రజలు వద్దు – గ్రాసిం ఇండస్ట్రీయే ముద్దు అనేదే మాజీ ఎమ్మెల్యే నినాదం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ : బలబద్రపురం. గడచిన ఐదేళ్ళ నుండీ గ్రాసిం వాళ్ళతో అంటకాగింది మీరు కాదా సూర్యనారాయణరెడ్డి? మీరు ఖర్చు చేసిన ఎన్నికల వ్యయం భరించింది గ్రాసిం వాళ్ళు కాదా? రాజమండ్రిలో మీ యూరాలజీ సెంటర్ నిర్మించింది గ్రాసిం, కాదా?

మీడియాతో MLA నల్లమిల్లి మాట్లాడుతూ…..

ఇటీవల కాలంలో మాజీ శాసనసభ్యులు మూడు నాలుగు ప్రెస్మీట్లు రిలీజ్ చేస్తా ఉన్నారు. వాటిని ప్రెస్మీట్లు అనే బదులు సోలో వీడియోలు అనడమే సబబు,

ఆయన విడుదల చేసే వీడియో రాజశేఖరరెడ్డి విగ్రహం ప్లేస్ మారుతుంది తప్ప వీడియోలన్నీ సోలో వీడియోస్ అవడం కామన్

ఈయన చెప్పే హరికధలు వినడానికి ఎవరూ రాకపోయినా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం అని ఓ డైలాగ్ వాడతారు పూర్వం రోజులలో హరికధ ప్రారంభ సమయంలో అశేష సంఖ్యలో హాజరైన జనావళికి అని చెప్పినట్లుగా,

పాపం ఎంతో మంది నాయకులను మాట్లాడమని బ్రతిమాలి ఎవరూ ఉత్సాహం చూపకపోవడంతో గతిలేక చివరకు ఆయనే సోలో వీడియో రిలీజ్ చేసుకోవలసిన పరిస్దితి దాపురించింది.

నేను మొన్న వారి స్క్రిప్ట్ రైటర్స్ కి సలహా ఇచ్చినపుడు మాజీ ఎమ్మెల్యే ని అల్లురామలింగయ్య తో పోల్చాను కానీ మాడా తో పోల్చాల్సింది. మాడా స్ధాయి వ్యక్తికి బరువైన స్క్రిప్టులు వ్రాసిస్తే ఆయన ఇబ్బంది పడటం సహజమే కదా,

బిక్కవోలు యంపిపి ఎన్నిక గురించి మాజీ ఎమ్మెల్యే, పదే పదే మాట్లాడటంలో ఆయనకు వచ్చిన కష్టం గురించి మనం అర్దం చేసుకోవాలి. స్టేట్ లో 52 చోట్ల ఎన్నిక జరిగితే వైయస్సార్ సిపి మెజారిటీ స్ధానాలను తిరిగి నిలబెట్టుకుంది కానీ బిక్కవోలులో చేతిలో 20/20 ఎంపీటీసీ లు ఉండి కూడా యంపిపి ని చేజార్చుకున్నారు. వీళ్ళ అహంకార నాయకత్వాన్ని భరించలేక ఎంపీటీసీ లు బయటకు రావడంతో యంపిపి చేజారిన సంగతి అధిష్టానానికి చేరి మాజీ ఎమ్మెల్యే,ని గట్టిగా మందలించడం జరిగింది. ఆ తలంటుని కవర్ చేసుకోవడం కోసమే ఆయన పదే పదే ప్రెస్మీట్లు పెడుతున్నాడు.

ఈరోజుకి కూడా ఆయనతో ఉన్న యంపిటిసియే మొన్న స్వయంగా ప్రెస్మీట్ (సోలో వీడియో కాదు) మరీ మాజీ ఆరోపణలు అవాస్తవం అని తేల్చిపడేసాడు. ఇంతకంటే పెద్ద చెంపపెట్టు ఏముంటుంది?

ఇంక పేకాట క్లబ్ లు, గంజాయి అంటూ రకరకాల అభాండాలు వేసారు ఆయన సోలో వీడియోలలో. ఈ 9 మాసాలలో నియోజకవర్గంలో పేకాట క్లబ్బులను ప్రోత్సహించడం గానీ గంజాయిని ప్రోత్సహించడం గానీ జరగడం లేదని మీ కార్యకర్తలు, మా కార్యకర్తలు చర్చించుకుంటూనే ఉన్నారు. నేను వాటికి దూరం అని అందరికీ తెలుసు,

కైకవోలు గంజాయి కేసు గురించి తప్పుడు ప్రచారం చేసారు. అక్కడ దొరికిన వ్యక్తి మీరు చెప్పినట్లు నా అనుచరుడు అయితే నేను అతడిని కాపాడే ప్రయత్నం చేసేవాడిని కదా. ఆ కేసులో వైయస్సార్ సిపి కార్యకర్తలు కూడా ఉన్నారు. వారిపై మాత్రమే కేసు ఉంచి నా అనుచరుడే అయితే అతడిని కేసు నుండి నేను తప్పించి ఉండేవాడిని కదా అనే కనీస జ్ఞానంతో మీరు ఆలోచించాలి కదా?

ఇక్కడ రిపోర్టర్లు మీరు చెప్పే అబద్దాలు వ్రాయరని ఏకంగా ధనుంజయరెడ్డి,ని మేనేజ్ చేసుకుని సాక్షిలో ఈ తప్పుడు వ్రాత వ్రాయించి దాన్ని బిజెపి అగ్రనేతల ఆన్ లైన్ అకౌంట్లకు ట్యాగ్ చేసారు మీరు. ఇంత దారుణమైన పరిస్దితిలో మీరు ఉన్నారు.

మీరు పేపర్లో నా అనుచరుడు అని పోటో వేసిన వ్యక్తి గురించి నేను పోలీసు లేదా ఇతర అధికారులతో మాట్లాడినట్లు మీరు రుజువుచేయగలరా?

ఇక గ్రాసిం ఇండస్ట్రీకి గత ఐదు సంవత్సరాలుగా మీరు ఎంత మద్దతు పలికారో నియోజకవర్గంలో అందరికీ తెలుసు. రాజమండ్రిలో మీ అబ్బాయి నిర్వహిస్తున్న 9 కోట్ల రూపాయిల యూరాలజీ సెంటర్ ని ఎవరు నిర్మించారు?

మీ ఎన్నికల ఖర్చుని భరించింది గ్రాసిం వాళ్ళు కాదా? ఆ కంపెనీ ప్రతినిధి మిమ్మల్ని గెలుపించి తీసుకురమ్మని మమ్మల్ని సియం జగన్మోహనరెడ్డి గారు ఆదేశించారు అని బహిరంగ మీటింగ్ లో చెప్పడం నిజంకాదా?

ఈరోజుకీ గ్రాసిం ఇండస్ట్రీలో కాంటాక్టులు మీ అనూయయులవి కాదా? ఈ 9 మాసాలలో నేను అవి ఎందుకు రద్దు చేయించలేదు? నేను మొదటి నుండి కేపీర్ గా ఉన్నప్పటి నుండీ దాన్ని వ్యతిరేకించాను ఈ రోజుకీ అదే స్టాండ్ తో ఉన్నాను.

నేను గ్రాసిం వాళ్ళను ఎప్పడూ పిలవలేదు, వాళ్ళు నన్ను రమ్మనీ అనలేదు,

గ్రాసిం విషయంలో నేను లేవనెత్తిన ప్రశ్నలు ఒక డాక్టరుగా మీరు కాదు అని చెప్పగలరా?

చుట్టుప్రక్కల ఉన్న ప్రవేట్ వైద్యులందరూ బలభద్రపురంలో క్యాన్సర్ ఉంది అని చెపుతా ఉంటే మీరు లేదని ఎలా చెపుతున్నారు?

మీకు బలభద్రపురం వద్దు – గ్రాసిం ఇండస్ట్రీ ముద్దు ఇదే మీ స్లోగన్,

ఇపుడు గ్రాసింని వెనుకేసుకు వచ్చిన మీరు గతంలో కేపీర్ సంస్ధని కూడా ఇదే విధంగా సమర్దించారు. కేపీర్ కి వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంటే ఏనాడైనా మీరు అక్కడికి వచ్చారా?

కేపీర్ దెబ్బ నేను తట్టుకోలేను నేనక్కడకి రానని ఆనాడు మీకు పోన్ చేసిన మహిళలతో చెప్పలేదా మీరు?

గ్రాసిం నుండి దోచేసిన మీరు పబ్లిక్ హియరింగ్ లో చిమ్నీ నుండి పొగరావడం లేదు ఇక్కడ కాలుష్యం ఏముందని చెప్పలేదా?మీ జ్ఞానం ఆ స్ధాయిలో ఉంది. మీరు చదువుకుని డాక్టరు అయ్యారా అనే అనుమానం కూడా వస్తుంది.

మీ జ్ఞానప్రదర్శన కోసం సోలో వీడియోలు రిలీజ్ చేసి భంగపడటం మీకు ఆనవాయితీగా మారింది.

గ్రాసిం గురించి గానీ, క్యాన్సర్ గురించి గానీ బలభద్రపురంలో బహిరంగ చర్చకు వస్తారా అని డిమాండ్ చేస్తున్నా,

ఆరోగ్యం ముఖ్యమా? ఆస్తులు ముఖ్యమా? ఒక డాక్టరుగా మీరే విధమైన సందేశం ఇస్తున్నారు?

మీరు మెడికల్ నేను నాన్ మెడికల్ ఇద్దరం చర్చలో కూర్చుందాం. మీకు సపోర్టు కావాలంటే నలుగురు డాక్టర్లను సహాయం తెచ్చుకోండి నేనొక్కడినే చర్చకు వస్తా.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Balabhadrapuram people don't want

You cannot copy content of this page

Scroll to Top