Potti Sriramulu : పొట్టి శ్రీరాములు మన గుండెల్లో ఉన్నాడు

TRINETHRAM NEWS
Potti Sriramulu is in our hearts

Potti Sriramulu : గుంటూరు జిల్లా : మార్చి 16 : (త్రినేత్రం న్యూస్); రాష్ట్ర కేంద్రమైన అమరావతిలో పొట్టి శ్రీరాములు నూట ఇరవై ఐదు వ జయంతి సందర్భంగా యాబై ఎనిమిది అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగం వల్లే ఆంధ్ర రాష్ట్ర సాధన సాధ్యమైందని తెలిపారు. ఆయన పేరు ఎప్పటికీ ప్రజల గుండెల్లోనే నిలిచిపోయిందని పేర్కొన్నారు. అక్కడ ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top