జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Iran attacks with ‘dancing missiles’!

Dancing Missiles : గల్ఫ్‌లోని అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. ఆదివారం తొలిసారిగా ‘డ్యాన్సింగ్ మిసైల్స్‌’‌తో ఇరాన్ దాడులకు దిగినట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. డ్యాన్సింగ్ మిసైల్‌తో పాటు ఇరాన్ ఈసారి తన అమ్ములపొదిలోంచి పలు ఇతర అస్త్రాలను ప్రయోగించినట్టు తెలిసింది.!

ఏమిటీ ‘డ్యాన్సింగ్ మిసైల్’?

ఈ బాలిస్టిక్ మిసైల్ అసలు పేరు సెజిల్-2. శత్రుదేశాలకు చిక్కకుండా పలుమార్లు తన దిశను స్వల్ప స్థాయిలో మార్చుకునే సామర్థ్యం ఈ మిసైల్ సొంతం. డ్యాన్స్ చేస్తున్నట్లు పలుమార్లు దిశను మార్చుకునే ఈ మిసైల్‌ను అక్కడి మీడియా డ్యాన్సింగ్ మిసైల్‌గా పిలుస్తోంది.

18 మీటర్ల పొడవు, 1.25 మీటర్ల వ్యాసార్థం ఉండే ఈ మిసైల్ గరిష్ఠంగా 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. 700 కిలోగ్రాముల పేలుడు పదార్థాలను తీసుకెళ్లగలదు. ఘన ఇంధనం వినియోగించే ఈ మిసైల్‌ను ప్రయోగించడం షహాబ్ మిసైల్స్‌తో పోలిస్తే మరింత సులువని నిపుణులు చెబుతున్నారు. సెజిల్ రకం మిసైల్స్‌ అభివృద్ధిపై ఇరాన్ 1990ల నుంచే దృష్టి సారించింది. 2008లో తొలిసారిగా ఈ మిసైల్‌ను ప్రయోగించింది.

You cannot copy content of this page