విశ్వేశ్వర స్వామి దేవస్థానం పాలకమండలి ప్రమాణస్వీకారోత్సవ సభలో ఎమ్మెల్యే గోరంట్ల…
త్రినేత్రం న్యూస్, రాజమహేంద్రవరం, డిసెంబర్ 11: పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపునిస్తూ కూటమి ప్రభుత్వం ఇస్తున్న పదవులను బాధ్యతగా భావించి నమ్మకాన్ని నిలబెట్టాలని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కోటిపల్లి బస్టాండ్ సమీపంలో గోదావరి గట్టు రోడ్డులో వేంచేసియున్న శ్రీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం (జోడు గుళ్ళు) పాలకమండలి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం గురువారం జరిగింది.
ఈ సందర్భంగా నూతన పాలకమండలిని గోరంట్ల బుచ్చయ్యచౌదరితో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవి రామ్ కిరణ్ అభినందించారు. దేవాలయాలకు పాలకమండలి సభ్యులుగా నియమితులైన ప్రతి ఒక్కరూ బాధ్యతగా నమ్మకంగా పనిచేయాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు,పవన్ కల్యాణ్, నారా లోకేష్ ఎంత కృషి చేస్తున్నారో, అదేవిధంగా ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేసి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. రాబోయే పుష్కరాల్లో భక్తులకు విరివిగా సేవలందించాలని సూచించారు.అనంతరం చైర్మన్ ఎస్.ఆర్ డోర్స్ అధినేత బొలిశెట్టి శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు సింగవరపు సత్యనారాయణ, ఆలేటి ధనలక్ష్మి, బోయి రాము, మెరపల మోహిని, ఐసెట్టి వీర వెంకటరమణ, కొర్రపాటి లక్ష్మి, సంఘంరెడ్డి సుబ్బాయమ్మ, ఇనపకుర్తి ఈశ్వరరావులను పూలమాలలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో టూరిజం కార్పోరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ దాలిపర్తి వేమన, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు, శీలం గోవిందు, నిమ్మలపూడి గోవింద్, బోరా దుర్గారావు, కొప్పిశెట్టి చిన్ని, వాసిరెడ్డి బాబి, పల్లి సాయి, కక్కల రమేష్, చిట్టిబోయిన శ్రీనివాస్, నిచ్చెనకోళ్ళ సత్తిబాబు, ఎమ్మెస్సార్ శ్రీను, బిజెపి నాయకులు బూరా రామచంద్రరావు, కందికొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


