MLA K.P. Vivekananda : ప్రజల మౌలిక సదుపాయాలే ప్రథమ ప్రాధాన్యం. అభివృద్ధి పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదు

TRINETHRAM NEWS

Trinethram News : ఈ రోజు గాజులరామారం డివిజన్‌లోని వార్డు నం.125 పరిధిలో ఉన్న రోడమేస్త్రీ నగర్ – B కాలనీలో నెలకొన్న సీసీ రోడ్డు మరియు డ్రైనేజ్ సమస్యలను పరిష్కరించేందుకు స్థానిక శాసనసభ్యులు కె. పి. వివేకానంద సంబంధిత శాఖ అధికారులతో కలిసి శుక్రవారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.

ఈ సందర్భంగా కాలనీవాసులు రోడ్ల దుస్థితి, వర్షాకాలంలో నిల్వ ఉండే మురుగు నీరు, డ్రైనేజీ అడ్డంకుల వల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను నిశితంగా పరిశీలించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు తగిన చర్యలు చేపట్టి సీసీ రోడ్డు నిర్మాణం, డ్రైనేజ్ మరమ్మతులు త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “ప్రజల మౌలిక సదుపాయాలే ప్రథమ ప్రాధాన్యం. రోడమేస్త్రీ నగర్ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. అభివృద్ధి పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండదని” స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కిష్టప్ప, స్థానికులు షేక్ ముజ్జు, షేక్ అమీర్, ఫర్జానా బేగం, షమీమ్ బేగం, షాహ్ నవాజ్, శాదూల్, మొహసిన్, పార్టీ నాయకులు కస్తూరి బాలరాజు, కమలాకర్, తెలంగాణ సాయి మక్సూద్ అలీ, ఇబ్రహీం, ఇమ్రాన్, నాగేష్, మహేష్,చెట్ల వెంకటేశ్, మద్దెల సాయిబాబా, శివ నాయక్, బాబి చౌదరి, హనుమంత్ నాయక్, లక్ష్మణ్, జునైద్ మరియు కాలనీ పెద్దలు, స్థానికులు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The infrastructure of the people is the first priority

You cannot copy content of this page

Scroll to Top