Jakkampudi Raja : కూటమి ప్రభుత్వంలో కరువైన శాంతిభద్రతలు

TRINETHRAM NEWS

ఎవరి దగ్గర మార్కుల కోసం పోలీసుల తాపత్రయం

ఎల్లకాలం ఒకరే అధికారంలో ఉండరన్న విషయం గమనించాలి

కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలు ఎక్కడ ?

వచ్చే ఎన్నికల్లో వైసిపికి పట్టం కట్టనున్న ప్రజలు

దుర్మార్గాలకు మూల్యం చెల్లించుకోక తప్పదు :జక్కంపూడి రాజా

రాజమహేంద్రవరం, మే 12: డా బి ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. కక్ష సాధింపు చర్యలు మితిమీరిపోయాయని, శాంతి భద్రతలు ఈ ప్రభుత్వంలో దారుణంగా తయారయ్యాయని ఆయన విమర్శించారు.

స్థానిక ప్రకాశం నగర్ కార్తికేయ ఎనక్లేవ్ లోని ఆయన స్వగృహంలో సోమవారం ఉదయం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి,వైసిపి నాయకు రాలు విడుదల రజని విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు శోచనీయమన్నారు. పిర్యాదు రిజస్టర్ కూడా చేయకుండానే వాళ్ళు అనుకున్నదే తడవుగా ఇంటి దగ్గర ఉంటె ఇంటి దగ్గర,ఎక్కడ ఉంటె అక్కడకు వెళ్లి వాళ్ళను లాక్కుని వచ్చే విధంగా ప్రవర్తించడం దారుణ మని రాజా అన్నారు.

ఎవరి మెప్పు కోసం,ఎవరి దగ్గర మార్కులు కొట్టేయడానికి ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పోలీసు వ్యవస్ట కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎల్లకాలం ఒకరే అధికారంలో ఉండరని, ప్రతి సారి ఇదే ప్రభుత్వం రాదని, ప్రతిసారి ఇదే వ్యక్తి సీఎం స్థానంలో కూర్చోరని, ప్రతిరోజూ ఇదే రకంగా ఉండదని రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలీసు అధికారి గ్రహించి నడుచుకోవాలని రాజా అన్నారు.

పరామర్శకు విడుదల రజని,ఆమె పిఎ వెళ్లారని, అయితే పి.ఎ ను పోలీసులు తీసుకు పోవడం,ఎందుకు తీసుకెళ్తున్నారని అడిగితె వ్యవహరించిన తీరు దారుణమని ఆయన వాపోయారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులను ఈవిధంగా వాడుకోవడం కూటమి ప్రభుత్వానికి తగదన్నారు.సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పి ఎందుకు అమలు చేయడం లేదని రాజా నిలదీశారు.అమ్మఒడి పధకాన్ని తల్లికి వందనంగా మార్చి ఎంతమంది ఉంటె అంతమందికి ఇస్తామని చెప్పి పంగనామాలు పెట్టారని అయన విమర్శించారు.
ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇష్టం వచ్చినట్లు విపక్ష నాయకులమీద,కార్యకర్తల మీద వేధింపులకు పాల్పడుతూ సమస్యను పక్కదారి పట్టించడానికి కూటమి ప్రభుత్వం కుయక్తితో వ్యవహరిస్తోందని రాజా విమర్శించారు.

శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలుకుని అన్ని జిల్లాల్లో వైసిపి శ్రేణులను అణచివేస్తూ, వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన వాపోయారు.మాజీ మంత్రి అని గాని, ఒక మహిళ అని గానీ చూడకుండా విడుదల రజని పట్ల సిఐ దౌర్జన్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. పోలీసు డ్రెస్ వేసుకుంటే సుప్రీం అయిపోయినట్లుగా ప్రవరించడం సిగ్గుచేటన్నారు.చట్టవ్యతిరేకంగా వ్యవహరించే ప్రభుత్వ పెద్దలు, పోలీసులు చట్టపరిధిలోనే ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని గ్రహించాలన్నారు.

ఇప్పుడు వ్యవహరిస్తున్న దుర్గ్మార్గ చర్యలకు భవిష్యత్తులో మూల్యం చెల్లుంచుకోక తప్పదని కూటమి పెద్దలు, పోలీసులు గ్రహించాలని ఆయన స్పష్టంచేశారు. ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన పరిస్థితిలో ఉంటారని మర్చిపోవద్దని రాజా హెచ్చరించారు.

ఇప్పటికే ప్రజలు విసిగిపోయి ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి తిరిగి పట్టడం కట్టడం ఖాయమని ఆయన అన్నారు.ఇప్పటికైనా తప్పుడు కేసులను వెనక్కి తీసుకోవాలని ఆయన హితవు పలికారు. దాడులు,కక్ష సాధింపులు పక్కన పెట్టి ఇచ్చిన హామీలపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన హితవు పలికారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Poor law and order

You cannot copy content of this page

Scroll to Top