దేవరకొండ మే 12 త్రినేత్రం న్యూస్. దేవరకొండ మండలంలోని తూర్పుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్
అనంతరం తూర్పుపల్లి నుండి కొమ్మేపల్లి వరకు 2.70 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. అనంతరం మహబూబ్ నగర్ జాతీయ రహదారి నుండి దౌరాజ్ తండా వరకు 1.60 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. ప్రజల సంక్షేమం, దేవరకొండ నియోజక వర్గ అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. ప్రతీ గ్రామాలలో మౌళిక వసతుల కల్పనకు ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది అని అన్నారు. సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే అధికారులను, కాంట్రాక్టర్ లను సూచించారు.
ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించి,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని, నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, అన్నివేళలో ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవ రెడ్డి, నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, వడ్త్య దేవేందర్ నాయక్, సిపిఐ రాష్ట్ర నాయకులు పల్లా నర్సింహా రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు లోకాసాని శ్రీధర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శిరందాసు కృష్ణయ్య, మాజీ సర్పంచుల సంఘం రాష్ట్ర అద్యక్షురాలు ధనలక్ష్మి బాల నారాయణ గౌడ్,యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కొర్ర రాంసింగ్ నాయక్, మార్కెట్ డైరెక్టర్ రాజు గౌడ్,మాజీ సర్పంచులు నాగరాజు, నర్య నాయక్, రాజ్ కుమార్,ఎంపిడిఓ డానియల్, మాజీ ఉప సర్పంచ్ మహేందర్ నాయక్,నాయకులు అంజి గౌడ్,NSUI నాయకులు, కార్యకర్తలు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


