జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు ప్రపంచ నర్సస్ దినోత్సవం సందర్భాముగా రాజమండ్రి పరిధిలోని సంబునగర్ ప్రాంతములో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రం హాస్పిటల్లో ఉన్న నర్సస్ అందరికి ఈరోజు ప్రపంచ నర్స్ డే ను హాస్పిటల్ ముఖ్య డాక్టర్ మనందన్ మరియు డిస్ట్రక్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మనోజ్ అధ్యక్షతన వి ఫర్ పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ పీఎంపీ యూనియన్ సభ్యులు డా సన్ని సౌజన్యంతో ఆరోగ్య కేంద్రంలో ఉన్న నర్సస్ అందరికి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. వి ఫర్ పీపుల్ ట్రస్ట్ సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని కృషిని గుర్తించి వారికి తగిన ప్రోత్సాహాన్ని నిరంతరం అందిస్తుందని వ్యక్తపరిచారు.

తదుపరి నర్సస్ ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్న సేవలను గుర్తుచేసుకుంటూ నర్స్ గా సేవలు అందిస్తున్న సేవకులు అందరూ వారి వారి కుటుంబ బాధ్యతనలను నిర్వహిస్తూ ప్రతి రోగిని సొంతవరిలా చూసుకుంటూ అంతులేని సేవలు అందించడం, కవిడ్ మహమరిని ఎదురుకోవడంలో నర్సస్ ప్రాణాలకు తెగించి సేవలను అందించడం చాలా సంతోషాన్ని కలిగించిందని, ప్రపంచం ఎంత ముందుకు వెళ్లిన నర్సింగ్ సేవలు లేకుండా మనం ముందుకు వెళ్లలేము అని తెలియచేసారు. అనంతరం వారు చేస్తున్న నిరంతర సేవకుగాను మన ట్రస్ట్ తరుపున కేక్ కటింగ్ చేయించి స్నాక్స్ పంచడం జరిగింది. అనంతరం నర్సస్ వారి సేవలను గుర్తించినదుకు, వారికి ట్రస్ట్ ద్వారా విషెస్ తెలిపినందుకు హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్సస్ మరియు ఏ న్ ఏం మరియు ఆశా వర్క్స్ వి ఫర్ పీపుల్ ట్రస్ట్ ట్రెజరర్ కోళ్ల లత సుప్రియ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Nurses Day Celebration under

You cannot copy content of this page