Transporting Cows : పోలీసులు దృష్టి సారించి గోవులను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

TRINETHRAM NEWS

అక్రమ గోవుల తరలింపును అడ్డుకున్న జంతు సంరక్షణ సంఘ నాయకులు

చట్ట విరుద్ధంగా గోవులను అక్రమంగా తరలిస్తున్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి

జంతు సంరక్షణ సంఘం కార్యదర్శి కిరణ్ ప్రసాద్ డిమాండ్

రాజమహేంద్రవరం: త్రినేత్రం, న్యూస్ ప్రతినిధి, గోవులను అక్రమంగా తలుస్తున్న లారీని జంతు సంరక్షణ సంఘం నాయకులు అడ్డుకున్నారు. శుక్రవారం రాజమహేంద్రవరం దివాన్ చెరువు వద్దగల జీరో పాయింట్ వద్ద కంటైనర్ లారీలో సుమారు 50 గోవులను తరలిస్తుండగా సమాచారం మేరకు కంటైనర్ను అడ్డుకున్నారు. గోవులతో ఉన్న ఈ కంటెనల్లారని రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. జంతు సంరక్షణ సంఘం కార్యదర్శి కిరణ్ ప్రసాద్ మాట్లాడుతూ పార్వతీపురం నుంచి హనుమాన్ జంక్షన్ కు గోవులతో కంటైనర్ లారీ వెళుతున్నట్లు తమకు సమాచారం అందిందని ఈ మేరకు దివాన్ చెరువు జీరో పాయింట్ వద్ద లారీని అడ్డుకుని తనిఖీలు చేయగా ఆ లారీలో సుమారు 50 గోవులు ఉన్నాయని తెలిపారు.

ప్రతిరోజు రాజమహేంద్రవరం మీదుగా వందలాది లారీలలో గోవులను తరలిస్తున్నారని తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న గోవులను, చట్టం లో ఉన్న ముసుకుల ఆధారంగా గోవులను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారని అన్నారు. గత ఐదు సంవత్సరాల కాలంగా చట్టవిరుద్ధంగా గోవులను తరలిస్తున్న లారీలను పట్టుకున్నామని అయినప్పటికీ పోలీసులు వీటిపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతో క్రమ తరలింపు కొనసాగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గోవుల తరలింపు పై ప్రభుత్వం పోలీసు అధికారులు దృష్టి సారించి గోవులను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Police should focus on

You cannot copy content of this page

Scroll to Top