త్రినేత్రం న్యూస్, ఆంధ్రప్రదేశ్‌లో మూడవ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్ పి సి ) పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారిస్తోంది. 2029 ఎన్నికల్లో చట్టసభలకు కొత్త నాయకత్వాన్ని పంపించడమే లక్ష్యంగా రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు కన్వీనర్లు, అలాగే 28 కొత్త జిల్లాలకు అధ్యక్షులు మరియు కార్యదర్శులను నియమించేందుకు పార్టీ చర్యలు చేపట్టింది.
ఈ క్రమంలో సత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా లెక్కల ధరణి కుమార్‌ను, కదిరి మరియు పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గాలకు కొట్టం హరిప్రసాద్, మంకముతక మంజునాథ్ లను కోఆర్డినేటర్లుగా నియమించారు. ఈ నియామకాలకు సంబంధించిన అధికారిక పత్రాలను పార్టీ జాతీయ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ జారీ చేశారు.
కదిరి బస్ స్టాండ్ సెంటర్‌లోని హోటల్ అత్తార్ రెసిడెన్సీలో పార్టీ నాయకులతో జరిగిన అంతర్గత సమావేశంలో మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మానవ హక్కులు రోజురోజుకు నిర్వీర్యం అవుతున్నాయని, మానవతా విలువలు క్షీణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర సంపద ఇతర రాష్ట్రాల రాజకీయ ప్రయోజనాలకు, అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థల ఆర్థిక స్వార్థాలకు వినియోగమవుతోందని ఆయన పేర్కొన్నారు. అపార ఖనిజ సంపద ఉన్న ఆంధ్రప్రదేశ్ నానాటికి పేదరికంలో మగ్గిపోతుందని తెలిపారు.
రాష్ట్ర సంపదను రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి ఉపయోగించి పేదరికం లేని సమాజాన్ని నిర్మించేందుకు ప్రజా చైతన్యంతో కూడిన ఉద్యమం అవసరమని మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నియమితులైన లెక్కల ధరణి కుమార్, కొట్టం హరిప్రసాద్, మంకముతక మంజునాథ్ మాట్లాడుతూ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. పార్టీ అధినేత మేడా శ్రీనివాస్ ఆశయాలను సాధించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వంకర మురళి నాయుడు, ధర్మవరపు శ్రీనివాసరావు, ఎస్.కే. హాసన్ వలి తదితరులు పాల్గొన్నారు.
పంగులూరి బుచ్చిబాబు కో–ఆర్డినేటర్ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ శాఖ…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


