జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Police awareness program

Police awareness program : త్రినేత్రం న్యూస్ రాంపల్లి గ్రామం ప్రతినిధి… గ్రామీణ ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించి నేరాలను నివారించేందుకు పెద్దపల్లి రూరల్ ఎస్‌ఐ మల్లేశ్ ఆధ్వర్యంలో రాంపల్లి గ్రామంలో సైబర్ మోసాలు,రోడ్డు భద్రత మరియు రాష్ & నెగ్లిజెంట్ డ్రైవింగ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.సీఐ మాట్లాడుతూ ప్రజలు పోలీసులతో సహకరిస్తూ చట్టాలను పాటిస్తే నేరాలను సమర్థవంతంగా తగ్గించవచ్చని తెలిపారు.గ్రామస్థులకు సైబర్ నేరాల నుండి ఎలా జాగ్రత్తపడాలి, అనుమానాస్పద ఫోన్ కాల్స్,ఓటీపీలు, లింకులు ఇతరులతో పంచుకోకూడదని వివరించారు.

అదే విధంగా రోడ్డు భద్రతా నియమాలు పాటించడం,హెల్మెట్ వినియోగం,అతివేగం మరియు నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు.ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ తమ ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు.గ్రామంలో మద్యపానం నిషేధం అమలు చేయాలని,బెల్ట్ షాపులు నిర్వహించకూడదని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.గ్రామ అభివృద్ధి మరియు ఆరోగ్యకరమైన వాతావరణం కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పోలీసులు అభినందించారు.రాంపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాలు కూడా మద్యపాన నిషేధం అమలు చేయడంతో పాటు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సీఐ కోరారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి రూరల్ ఎస్‌ఐ మల్లేశ్ ఆధ్వర్యంలో పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, పెద్దపల్లి ఎంపీడీఓ, పీహెచ్‌సీ డాక్టర్, పోలీస్ సిబ్బంది మరియు సుమారు 200 మంది గ్రామస్థులు పాల్గొన్నారు

You cannot copy content of this page