అరకువేలిలో వాహనదారులకు సూచనలు చేసిన సీఐ హిమగిరి రావు.
ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా (అరకులోయ) త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం ఇంచార్జ్ ఏప్రిల్ 4 : అరకువేలిలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు జరిగింది. ఎస్పీ అమిత్ బర్దర్ వారి ఆదేశాల మేరకు, అరకువేలి సీఐ హిమగిరి రావు స్థానిక అక్షయ ఇన్ హోటల్ లో ఈ సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి లారీ, కారు, ఆటో వాహన యజమానులు హాజరై, ట్రాఫిక్ నియమాలపై అవగాహన పొందారు.
ఈ సందర్భంగా సీఐ హిమగిరి రావు మాట్లాడుతూ, అరకు వాలీ టూరిజం ప్రదేశంగా ఉండటంతో వాహనాల రాకపోకల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాహనదారులు తమ వాహనాలను నిర్ణీత స్థలాల్లో నిలిపి ఉంచాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మత్తు పానీయాలు సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరమని, ఇటువంటి ఘటనలు నమోదయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆటో యజమానులు అధిక లోడుతో వేగంగా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, బైకులు అధిక వేగంతో నడపడం వల్ల ప్రాణనష్టం జరుగుతోందని ఆయన తెలిపారు. అటువంటి డ్రైవింగ్‌పై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
కారు యజమానులు మాట్లాడుతూ, అరకు వాలీలో కారు పార్కింగ్‌కి తగిన స్థలాలు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. దీనిపై స్పందించిన ఎస్‌ఐ గోపాల్ రావు, ఎమ్మార్వో ప్రసాద్ రావుతో కలిసి పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సీఐ హిమగిరి రావు, ఎస్‌ఐ గోపాల్ రావు, ఎమ్మార్వో ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


