త్రినేత్రం న్యూస్ పెనుమూరు. పెనుమూరు మండలం రామకృష్ణాపురం పంచాయతీ అట్ల వారి పల్లి గ్రామంలో ఆత్మ మరియు రాస్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కె వి కె సీనియర్ సైంటిస్ట్ పిఎస్ సుధాకర్ మాట్లాడుతూ రైతులు మామిడిలో సస్యరక్షణ కొరకు నీటి యాజమాన్యం, ఎరువులు, కొమ్మ కత్తిరింపులు, పూత దశలో పిచికరి చేయవలసినటువంటి మందులు గురించి, పిందే దశలో నీటి యాజమాన్యం గురించి రైతులకు అవగాహన కల్పించారు.
ఆత్మ బిటిఎం గంగాధర్ నెల్లూరు దేవేంద్ర మాట్లాడుతూ మహిళా రైతులు చిరుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు లాంటివి పండించి ఆర్థికంగా ఎదగాలని సూచించారు.
ఇందులో ప్రాజెక్ట్ డైరెక్టర్ చంద్రబాబు రైతులు చంద్రశేఖర్, రఘు,పవన్, హరీష్, చక్రధర్ కేశవ బాబు, మహిళా రైతులు మరియు మాజీ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


