Trinethram News : ఆపరేషన్ సిందూర్ కేవలం పేరు మాత్రమే కాదు.. దేశ ప్రజల భావనల ప్రతిబింబం, న్యాయానికి ప్రతీక. ఆపరేషన్ సిందూర్‌తో 100 మందికి పైగా ఉగ్రవాదులను అంతం చేశాం. ఉగ్రవాదులు మా చెల్లెళ్ళ సిందూరాన్ని తుడిచారు.. అందుకే ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేశాం. ఉగ్రవాదులను ఒక్క దెబ్బతో ఖతం చేశాం
భారత్ దాడితో పాకిస్తాన్ భయపడి బ్రతికే దారులు వెతికింది.. మమ్మల్ని కాపాడండి అంటూ ప్రపంచం మొత్తం అడుక్కుంది. మా చేతిలో దెబ్బ తిన్నాకా.. పాకిస్తాన్ డీజీఎంవో మా డీజీఎంవోను సంప్రదించి, మమ్మల్ని వదిలేయండి అని అడుక్కుంది. కానీ అప్పటికే మేము ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేశాం.. ఉగ్రవాదులను ఖండ ఖండాలుగా చంపి, పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించాం.
ఉగ్రవాదులు దాడి చేస్తే మా పద్ధతిలో వారి మూలలను గుర్తించి సంహరిస్తాం. న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ చేస్తే భారత్ సహించదు. ఉగ్రవాదులను, ఉగ్రవాదులను పోషిస్తున్న దేశాలను మేము వేరు వేరుగా చూడం.. మా దృష్టిలో ఇద్దరు ఒక్కటే. పాకిస్తాన్‌తో చర్చలు జరగాలంటే.. అది ఉగ్రవాదం మీద, పీవోకే మీద అయితేనే జరుపుతాం – ప్రధాని మోడీ
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


