Operation Sindhur 2.0 : విదేశాంగ శాఖ ప్రెస్ మీట్

TRINETHRAM NEWS

ఆపరేషన్ సింధూర్ 2.0పై కీలక వివరాల ప్రకటన

Trinethram News : నిన్న రాత్రి మన సైనిక స్థావరాలే లక్ష్యంగా పాకిస్తాన్ దాడులు చేసింది.. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లను సమర్థవంతంగా కూల్చేశాం.. ఈ డ్రోన్లు టర్కీకి చెందినవిగా ప్రాథమికంగా గుర్తించామని కల్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు.

భారత గగనతలంలోకి పాకిస్తాన్ డ్రోన్లు.. యుద్ధ విమానాలు వచ్చాయి.. ప్రతిదాడుల విషయంలో భారత్ సంయమనం పాటించింది.. భారత మిలిటరీ లక్ష్యాలను పాకిస్తాన్ టార్గెట్ చేసింది.. 300- 400 డ్రోన్లతో పాక్ దాడికి ప్రయత్నించింది.. వాటిని సమర్థవంతంగా కూల్చేశామని వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ తెలిపారు.

అంతర్జాతీయ ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని భారత్ సంయమనం పాటించింది.. భారత నగరాలు, విమానాశ్రయాలు మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా పాక్ దాడులు చేసింది.. ఎల్ఓసీ వెంబడి పాకిస్తాన్ ఆర్మీ నిరంతరం కాల్పులు జరుపుతుంది.. లేహ్ నుంచి సర్ క్రిక్ వరకు 36 చోట్ల పాకిస్తాన్ దాడులు చేసింది.. మన గురుద్వారాల మీద దాడి చేయడం ద్వారా దేశంలో మత ఘర్షణలు సృష్టించాలని పాక్ ప్రయత్నించిందని, ప్రపంచాన్ని మోసం చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తుంది.. భారత్ లోని మతసామరస్యాన్ని చెడగొట్టేందుకు పాక్ కుట్రలు చేస్తోంది.. ప్రార్థనా మందిరాలపై దాడి చేయలేదని పాక్ చెప్పడం అబద్ధం..

కర్తార్ పూర్ కారిడార్ మూసివేశాం.. గురుద్వారాలు, ఆలయాలే టార్గెట్ గా పాకిస్తాన్ కుట్రలు చేసింది.. ఇవాళ జరిగే ఐఎంఎఫ్ సమావేశంలో పాకిస్తాన్ కు సహాయం చేయొద్దని కోరతామని, నిన్న రాత్రి మన సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది.. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లను సమర్థంగా కూల్చేశాం.. కూలిన డ్రోన్ల ఫోరెన్సిక్ విశ్లేషణలో టర్కీకి చెందినవిగా గుర్తించాం.. ఎల్ఓసీ వెంబడి పాకిస్తాన్ ఆర్మీ నిరంతరం కాల్పులు జరుపుతుంది.. 36 చోట్ల దాడులకు పాక్ యత్నించింది.. పాక్ దాడులను మన సైన్యం తిప్పికొట్టింది.. భారత్ ఎదురు దాడిలో పాక్ సైన్యానికి భారీ నష్టం జరిగిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ministry of External Affairs

You cannot copy content of this page

Scroll to Top