ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
39వ డివిజన్‌లో ఆకస్మిక పర్యటన
త్రినేత్రం న్యూస్ రాజమహేంద్రవరం : ప్రజల ఆరోగ్యం తమ ధ్యేయమని, అలాగే నగర శుభ్రత మనందరి మాధ్యత అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) అన్నారు. మంగళవారం ఉదయం ఆయన 39వ డివిజన్‌లో రాజమండ్రి పార్లమెంట్ డాక్టర్స్ సెల్ అధ్యక్షులు యాళ్ల ప్రదీప్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ అధ్యక్షులు వై శ్రీను తదితరులతో కలిసి ఆకస్మికంగా పర్యటించారు. సదరు డివిజన్‌లో శానిటేషన్ ఏ విధంగా చేస్తున్నారో పరిశీలించారు. డివిజన్‌లోని మస్తర్ల కార్యాలయానికి వెళ్లి అన్ని రికార్డులను పరిశీలించారు. సదరు డివిజన్‌లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేపట్టాలని శానిటేషన్ సిబ్బందికి సూచించారు. డ్రైనేజీల్లో పేరుకుపోతున్న సిల్టును ఎప్పటికప్పుడు తొలగించి మురుగునీరు సక్రమంగా పారేలా చూడాలన్నారు.
డివిజన్లో నిత్యం పారిశుద్య నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని, రికార్డులను సక్రమంగా రాయాలంటూ సూచించారు. లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామంటూ శానిటరి ఇన్స్పెక్టర్, సిబ్బందిని హెచ్చరించారు. సిల్టు లేకుండా నిత్యం డ్రైనేజీలను శుభ్రం చేయాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి లోపం కనిపించినా సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యం, నగర పరిశుధ్రతే ధ్యేయంగా పని చేయాలని సూచించారు. స్థానిక టీడీపీ నాయకులు, నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది ఆయన వెంట ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


