ఎం ఎల్ ఏ బాలు నాయక్.
దేవరకొండ మే 11 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం లోని పీఏ పల్లి మండలం లోని అంగడిపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో యశోద హాస్పిటల్ మలక్పేట్ వారి సౌజన్యంతో. పి ఎ పల్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి సహకారంతో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రజాప్రతినిధులతో ప్రారంభించిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తుందని అన్నారు. గ్రామాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ఉప కేంద్రాలను నిర్వహిస్తున్నామని అన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి లక్ష్యంగా ముందడుగు వేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి కోట్ల రూపాయల నిధులు కేటాయించి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తుందన్నారు యశోద ఆసుపత్రి వారు కల్పిస్తున్న ఉచిత వైద్య సేవలను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం వైద్య శిబిరంలో వైద్యులు చేస్తున్న వైద్య పరీక్షలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఎల్లయ్య యాదవ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కబోడియా నాయక్, మాజీ ఎంపీపీలు వంగాళ ప్రతాపరెడ్డి తేర సత్యం రెడ్డి, సీనియర్ నాయకులు పాల్వాయి వెంకటరెడ్డి, కసిరెడ్డి శ్రీనివాసు రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కామల వెంకటయ్య, మాజీ ఎంపీపీ ఏడుపుల గోవింద్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సతీష్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బాలకృష్ణ, గ్రామ శాఖ అధ్యక్షులు శేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటరెడ్డి, పాండు నాయక్, కుశలయ్య, అక్బర్, యువ నాయకులు ముత్యాలు, శివ, వైద్య సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


