ఎంఎల్ఏ బాలు నాయక్.
దేవరకొండ మే 07 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి సాగు నీరు అందించే నా దే.
దేవరకొండ నియోజక వర్గంలో ఉన్న ప్రతీ పేదవాడికి ఇళ్లు కట్టించే బాధ్యత నాది.. ఐదు సంవత్సరాలలో దేవరకొండ నియోజగవర్గాన్ని 119 నియోజగవర్గాలలో నెంబర్ 1 చేసే బాధ్యత నాది..
– ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ .
దేవరకొండ మండలంలోని మర్రి చెట్టుతండా వద్ద 15లక్షల రూపాయల వ్యయంతో మైత్రి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ వారు మరియు ట్రైకర్ నిధులతో నిర్మించిన గోదాంను నాబార్డ్ సూర్యాపేట DDM రవీందర్ నాయక్, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్*
మైత్రి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ వారి ఆధ్వర్యంలో నిర్మించిన గోదాం ను రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రజా పాలనలో ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఆహార భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం.
రాజీవ్ యువ వికాసం పథకంతో నిరుద్యోగుల జీవితాలు మారుతాయి, వారి జీవన ప్రమాణాలు పెరుగుతాయి రాష్ట్రంలో ఈ పథకం ఒక గేమ్ చేంజర్ గా మిగులుతుంది. నిరుపేద, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, సామాజిక న్యాయ సాధికారత లక్ష్యంగా ప్రజా పాలన సాగిస్తున్నాం.
శాసన సభ ఎన్నికల్లో అత్యధికంగా మెజారిటీ ఇచ్చిన ముదిగొండ, తెల్దేవారి పల్లి,ఉమ్మడి మైనంపల్లి గ్రామాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నా శాయశక్తుల కృషి చేస్తా అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా,నాబార్డ్ DDM సూర్యాపేట రవీందర్ నాయక్,PACs చైర్మన్లు డాక్టర్ వేణుధర్ రెడ్డి,కొండ్ర శ్రీశైలం యాదవ్, ఎంపిడిఓ డానియల్, స్పెషల్ ఆఫీసర్ శంకర్, మాజీ ఎంపీటీసీ కొర్ర గౌతమి రాంసింగ్ నాయక్,యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కొర్ర రాంసింగ్ నాయక్,యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ,మాజీ ఎంపీటీసీ సీత్యా నాయక్,మాజీ కో ఆప్షన్ సభ్యులు,మాజీ సర్పంచులు మాజీ పాండు నాయక్,ఆంజనేయులు,శ్రీను నాయక్,శంసిర్ ఆలీ, లక్ష్మణ్ నాయక్,అంజయ్య,వెంకటయ్య, లక్ష్మణ్ నాయక్,నాబార్డ్ డైరెక్టర్లు,NSUI నాయకులు,గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


