అనితమ్మ హోమ్ శాఖపై పవన్ కళ్యాణ్ పగ బట్టరా

TRINETHRAM NEWS

అనితమ్మ సహనం పవన్ కళ్యాణ్ కు అలుసుగా మారింది.

మేడాశ్రీనివాస్ సందేహాలు
రాష్ట్రీయ ప్రజాకాంగ్రెస్

త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 22. రాజమహేంద్రవరం, సొంత నియోజకవర్గం పిఠాపురం లో జరుగుతున్న నేరాలపై దృష్టి సారించని మన పవన్ కళ్యాణ్ భీమవరం లో జూదాల కోసం డి ఎస్ పి జయసూర్య పై సీరియస్ అవ్వటమా ! ఈ అంశం లో మరో కోణం వుంది అనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ డి ఎస్ పి, పై ఉన్నత అధికారులకు ఫోన్ చేసి నివేదిక కోరటం కాదు . అంతర్గత నివేదికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, తెప్పించుకుంటే కొన్ని కొత్త కోణాలతో వాస్తవాలు, భహిర్గతం అవుతాయి ..

నిజానికి పవన్ కళ్యాణ్ సొంత శాఖపై కన్నా ఇతరుల శాఖ పైనే ఎక్కువగా దృష్టి సారించటం కూడా అనేక, అనుమానాలకు తావు నిస్తుంది .. పలుమార్లు హోమ్ మంత్రి అనితమ్మ శాఖనే పవన్ కళ్యాణ్ ఉద్దేశ్య పూర్వకంగా టార్గెట్ చేస్తుండటం, కూడా బాదాకరం.

పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో దళితులను సాంఘిక భహిష్కరణ చేసినా , చిత్తూరు జిల్లాలో సొంత శాఖపై దాడులు చేసినా , కందుకూరులో, తన సొంత సామజిక వర్గం లక్ష్మి నారాయుడి,ని అత్యంత పాశవికంగా హత్య చేసినా , సుగాలి ప్రీతి,ఆయాషా మీరా హత్యలు,పసిపిల్లల పై జరిగే అఘాయిత్యాలు, పవన్ కళ్యాణ్ కు కనపడక పోవటం ఆశ్చర్యం .

నిత్యం అనితమ్మ శాఖ పైనే దృష్టి పెట్టడం,ఆ శాఖ ప్రతిష్టను బ్రష్టు పట్టించటమే పవన్ కళ్యాణ్ ప్రధాన, కర్తవ్యంగా,కనపడుతుంది. అనితమ్మ సహనం కోల్పోతే పవన్ కళ్యాణ్ కు గడ్డు పరిస్థితులు తప్పవు.

యావత్ ఆంధ్ర రాష్ట్రంలోనే మద్యం ,ఇసుక,మత్తు ప్రదార్దాలు,ఇతర కొన్ని నేరాలు గ్రామాల్లో సాశిస్తుంటే పవన్ కళ్యాణ్ కు భీమవరం పేకాటనే కనబడిందా ! భీమవరం ప్రక్కనే పవన్ కళ్యాణ్ సహచర మంత్రి ఆధ్వర్యంలో బాహటంగా పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నా అనితమ్మ శాఖ పైనే ఎక్కువగా పవన్ కళ్యాణ్ గురి పెట్టడంపై అనేక సందేహాలు షికార్లు చేస్తున్నాయి .

అనితమ్మ శాఖపై ఇదే విధంగా పవన్ కళ్యాణ్ నిత్యం పెత్తనం చెలాయిస్తే అనితమ్మ సామాజిక వర్గం నుండి పవన్ కళ్యాణ్ కు నిరసన సెగ తప్పదు . పవన్ కళ్యాణ్ ప్రస్తుతం యంజయ్ చేస్తున్న శాఖపై నిరుత్సాహం తోనే పవన్ కళ్యాణ్ అనితమ్మ శాఖ లో పలుమార్లు వేలు పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి .

భీమవరం డి ఎస్ పి ఆర్. జి. జయసూర్య తో పవన్ కళ్యాణ్ నేరుగా తలపడటానికి పేకాట క్లబ్బు లే కారణమా ! మరెమైనా కారణాలు ఉన్నాయా !

పవన్ కళ్యాణ్ , డి ఎస్ పి , జయసూర్య వివాదంపై ముఖ్యమంత్రి, హోమ్ మంత్రి , డి జి పి పై ఒత్తిడి తీసుకురావటం వెనుక బలమైన కారణమే వుంది. పేకాట క్లబ్బులు కారణం కాకపోవచ్చును .

ఏపి డి జి పి, హోమ్ మంత్రి తన శాఖ అధికారి డి ఎస్ పి జయసూర్య కు అండగా నిలుస్తారో . పవన్ కళ్యాణ్ రాజకీయ ఒత్తిడికి తలాగ్గుతారో వేచి చూడాలి .

త్వరలో అనితమ్మ మంత్రి పదవికి పవన్ కళ్యాణ్ ఏమైనా ఎసరు పెట్టే ఆలోచనలు ఉన్నాయా ! ఉన్నట్టే పరిస్థితులు కనపడుతున్నాయి ..

–మేడా శ్రీనివాస్ ,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Pawan Kalyan's revenge on Anithamma's home department!

You cannot copy content of this page

Scroll to Top