ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విమర్శ
త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 22, మండపేట, రాయవరం మండలం కొమరిపాలెం శివారు వి సావరం వద్ద ఇటీవల జరిగిన బాణాసంచా ప్రమాదంలో పదిమంది చనిపోయిన బాధితుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం రూ 15 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం కేవలం కంటి తుడుపు చర్య మాత్రమేనని రాష్ట్ర సబార్డినేట్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ , మండపేట నియోజకవర్గ వైసిపి ఇన్ ఛార్జ్ తోట త్రిమూర్తులు,తీవ్రంగా విమర్శించారు.మండపేట విజయలక్ష్మి నగర్ లోని వైసీపీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కోటి రూపాయల, ఎక్స్‌గ్రేషియాను ప్రకటించి, తక్షణమే చెల్లించేలా ఏర్పాట్లు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం బాధితుల పట్ల చూపుతున్న నిర్లక్ష్యం దారుణమన్నారు.
కొమరిపాలెం రాయవరం గ్రామాల బాధితుల కుటుంబాల్లో పెద్దదిక్కు కోల్పోయిన పిల్లల చదువుల బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని, డిమాండ్ చేశారు. పిల్లల విద్యార్హతలు బట్టి ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం అందించేలా ఏర్పాట్లు చేయాలని తోట త్రిమూర్తులు డిమాండ్ చేశారు. కనీసం రూ 25 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఉంటే బాగుండేదని అభిప్రాయ పడ్డారు. గతంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలకు రూ 25 లక్షలు డిమాండ్ చేసి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆ మాట మర్చిపోయారా, అని ఎద్దేవా చేశారు.ఈ ప్రమాదంపై ప్రభుత్వం మరింత సానుభూతితో, వ్యవహరించాలని కోరారు. బాధితులకు పూర్తి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


