Dr. Satthi : కల్తీ నెయ్యి కాదు.. చంద్రబాబు కల్తీ రాజకీయాలు
- తిరుమల లడ్డూలో జంతు కొవ్వు అబద్ధం – కుట్ర నిజం
- హిందూ భక్తుల మనోభావాలను గాయపరిచిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరియు, కో
- పాప పరిహార పూజలతో దైవక్షమాపణ
- కోట్లాది భక్తులకు క్షమాపణ చెప్పాల్సిందే
- నిజం గెలిచింది – అబద్ధం ఓడిపోయింది
- త్రినేత్రం న్యూస్, జనవరి 31, అనపర్తి, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్న చంద్రబాబు నాయుడు చేసిన ఘోర అపచారం కోట్లాది భక్తుల మనోభావాలను తీవ్రంగా కలచివేసిందని అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి హోదాలో ఉండి తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ఎలాంటి ఆధారాలు లేకుండా చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లోనే అత్యంత దుర్మార్గమైన కుట్రగా నిలిచిందన్నారు. ఈ అపచారం వల్ల రాష్ట్ర ప్రజలకు, భక్తులకు ఎలాంటి నష్టం కలగకూడదనే ఉద్దేశంతో వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి, ఆదేశాల మేరకు పాప పరిహార పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందన్న చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా కూటమి నేతలు చేసిన దుష్ప్రచారం పూర్తిగా అసత్యమని కోర్టుకు సమర్పించిన చార్జ్‌షీట్‌లో స్పష్టంగా తేలిందన్నారు. న్యాయస్థానంలో నిజాలు వెలుగులోకి వచ్చినప్పటికీ కావాలనే అబద్ధపు ప్రచారం కొనసాగించడం మరింత దుర్మార్గమని విమర్శించారు.
ఈ నేపథ్యంలో ఈరోజు (31-01-2026), శనివారం, అనపర్తి నియోజకవర్గం, అనపర్తి గ్రామం పాతఊరులోని నేషనల్ వెంకట్ రెడ్డి, నివాసం పక్కనున్న పోతారెడ్డి రామాలయం ప్రాంగణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో, అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఆధ్వర్యంలో ప్రత్యేక పరిహార పూజలు నిర్వహించారు.
కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి వారు కూటమి నేతలకు సద్బుద్ధి ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఈ పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే ఇది ఒక భారీ కుట్రగా మిగిలిపోతుందన్నారు. అబద్ధాల పునాదులపై, విషప్రచారంతో ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి రాజకీయ లాభాలు పొందాలన్న చంద్రబాబు నాయుడు రచించిన కుట్ర చివరకు పూర్తిగా కూలిపోయిందన్నారు. నిజం గెలిచిందని, అబద్ధం ఓడిపోయిందని స్పష్టం చేశారు.
తిరుమల ఆలయాన్ని వేదికగా చేసుకుని స్వామివారి పవిత్ర ప్రసాదాన్నే ఆయుధంగా మార్చిన రాజకీయాన్ని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోరన్నారు. కోట్లాది భక్తుల ఆరాధ్య దైవాన్ని కూడా రాజకీయాల కోసం వాడుకోవడం చంద్రబాబు రాజకీయ నైజమన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్ డి డి బి, ఎన్ డి ఆర్ ఐ, వంటి జాతీయ స్థాయి ల్యాబులు నిర్వహించిన పరీక్షల్లో తిరుమల లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు లేదని స్పష్టమైందన్నారు. ఈ నివేదికలు భక్తులందరికీ ఊరటనిచ్చాయని చెప్పారు.
నిజాలు నిర్ధారణ కాకుండానే తిరుమల క్షేత్ర ప్రతిష్టను దెబ్బతీయడానికి చంద్రబాబు వెనకాడలేదన్నారు. తిరుమల ప్రతిష్ట, రాష్ట్ర గౌరవం, హిందూ మత గౌరవం అన్నింటినీ పణంగా పెట్టి రాజకీయాలు చేశారని విమర్శించారు.
చివరగా డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, మాట్లాడుతూ, రాజకీయాల కోసం చివరకు దేవుడినీ వదలని చంద్రబాబు తీరును ప్రజలు గమనించాలని కోరారు. అబద్ధపు ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు వైయస్‌ఆర్‌సీపీ స్పష్టమైన విజ్ఞప్తి చేస్తోందని తెలిపారు.
ఈ సందర్భంగా నిర్వహించిన పాప పరిహార పూజలో నియోజకవర్గ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

