Dr. Satthi : క్షమాగుణం క్రీస్తు మార్గం

TRINETHRAM NEWS

అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి

త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 13, క్షమాగుణం ఏసుక్రీస్తు మార్గమని అందరూ ఆయన మహిమలు తెలుసుకుని పాటించాలని అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త , మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, పేర్కొన్నారు. రంగంపేటలో వైయస్‌ఆర్‌సీపీ కల్చలర్ విభాగం జిల్లా అధ్యక్షుడు కుసుమంచి కృష్ణంరాజు, ఇంటి వద్ద, నిర్వహించిన క్రిస్మస్ వేడుకలో డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిస్సహాయులపై కరుణ, సాటివారిపై ప్రేమ చూపడం ద్వారా సన్మార్గం వైపు నడువవచ్చన్న క్రీస్తు బోధనలు ఆచరణీయమన్నారు. జడ్పీటీసీ సభ్యుడు పేపకాయల రాంబాబు మాట్లాడుతూ ప్రేమ, శాంతి, దయాగుణం కలిగి మానవాళిని సన్మార్గంలో నడిపించడానికి ఏసుప్రభు జన్మించారని తెలిపారు. డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికీ ముందుస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి,ని పాస్టర్లు ఘనంగా సత్కరించారు.

అనంతరం కుసుమంచి కృష్ణంరాజు, శివదుర్గ దంపతులు సమకూర్చిన చీరలను 60 మంది మహిళలకు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాతలు కృష్ణంరాజు శివదుర్గ దంపతులను డాక్టర్ సూర్యనారాయణరెడ్డి అభినందించారు.

ఈ కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర చేనేత విభాగం కార్యదర్శి పాలాటి నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు, అడబాల వెంకటేశ్వరరావు, వైయస్‌ఆర్‌సీపీ నాయకులు జాస్తి సత్తిబాబు, కంటిపూడి బుజ్జి, పేపకాయల మణికంఠ, గొల్లపల్లి రవి, పాస్టర్లు అరుణ్ కుమార్, జాను పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Forgiveness is the way of Christ

You cannot copy content of this page

Scroll to Top