NHM : సి.పి.ఐ.ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ను కలిసిన ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు

TRINETHRAM NEWS

వరంగల్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. హరిత కాకతీయ హోటల్లో అభినందన సభ వచ్చిన సందర్భంలో ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు సి.పి.ఐ.ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ను కలిసిన జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ఉద్యోగులకు సంబంధించిన వినతి పత్రాన్ని నాయకులు అందజేశారు. జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నూర సంపత్ పటేల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్ హెచ్ ఎం ఉద్యోగులందరికీ క్యాడర్ ఫిక్సేషన్ చేసి బేసిక్ పే అమలు చేయాలి , పి.ఎఫ్. ద్వారా ప్రతి ఎన్ హెచ్ ఎం ఉద్యోగి పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ విధానంలో ప్రతి ఉద్యోగికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి, ప్రస్తుత కాలానికి అనుగుణంగా పెరిగిన నిత్యవసర ధరలు , పిల్లల చదువులకు తగ్గట్టుగా మూల వేతన సవరణ చేయగలరు, పెండింగ్ లో ఉన్న 7 నెలల పి.ఆర్.సీ.బకాయిలు వెంటనే చెల్లించాలి,

ఎన్ హెచ్ ఎం ఉద్యోగి వీధి నిర్వహణలో మరణిస్తే వారి ఇంట్లో ఒకరికి ఆరు నెలల లోపు కారుణ్య నియామకం చేపట్టాలి, మహిళ ఉద్యోగస్తులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరి చేయాలి, ఉద్యోగులందరికీ సంవత్సరానికి 35 సాధారణ సెలవులు మంజూరు చేయాలి, ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ హెల్త్ కార్డ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని,సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎన్.హెచ్. ఎం. ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగినది. అనంతరం ఎమ్మెల్సీ నెల్లీకంటి సత్యం ను జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది. పై విషయమై సి.పి.ఐ. ఎమ్మెల్సీ సత్యం సానుకూలంగా స్పందిస్తూ త్వరలో ఉద్యోగులందరికీ సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎన్ హెచ్ ఎం ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇచ్చేటట్టుగా ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పిస్తానని మాట ఇవ్వడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

NHM employees meet CPI

You cannot copy content of this page

Scroll to Top