పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిత్యవసర ధరలను తగ్గించాలి….
Trinethram News : సామర్లకోట,ఏప్రిల్,10: భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సామర్లకోట విగ్నేశ్వర టాకీస్ వీధిలో పట్టణ సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్ది రెడ్ల సత్యనారాయణ అధ్యక్షతన గురువారం ఉదయం ప్రజా సమస్యల స్పందనక్కై సిపిఐ ప్రచార జాతను ప్రారంభించడం జరిగింది. ఈ జాతకు ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. కామిరెడ్డి బోడకొండ ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వందేళ్ల చరిత్ర గల పార్టీ అని, ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేసిన ఘనమైన చరిత్ర పార్టీకి కలదని, భూ పోరాటాలు, దున్నేవాడికి భూమి, గ్రామీణ ఉపాధి హామీ పథకాలు, బ్యాంకులు జాతీయకరణం తదితర అనేక రకాల ఉద్యమాలు చేసింది భారత కమ్యూనిస్టు పార్టీ అని ఆయన అన్నారు.
అర్హులైన పేద ప్రజలందరికీ గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు భూమిని, అర్బన్ ప్రాంతాల్లో రెండు సెంట్లు భూమిని ప్రభుత్వం కేటాయించి 5 లక్షల రూపాయల ఇల్లు నిర్మాణం కొరకు లోన్లు కేటాయించాలని ఆయన అన్నారు. ప్రజా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అని కాకినాడ జిల్లా అంతా ఈ ప్రచార జాత జరుగుతుందని, ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ఉద్యమాలు చేపడుతామని ఆయన అన్నారు. తోకల ప్రసాద్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానంలో భాగంగా ఉచిత గ్యాస్ పంపిణీ పథకం అమలు చేస్తూనే మరోపక్క దొడ్డి దారిన నడ్డి విరిచే చందంగా గ్యాస్ పై ₹50 అదనంగా పెంచి సామాన్య ప్రజలపైనిలువు దోపిడీ చేస్తున్నారని, పెట్రోల్, డీజిల్ నిత్యవసర అధిక ధరలు వెంటనే నియంత్రించాలని,
సామాన్య ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేయాలని, రైతులకు ఉచిత విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలలో చదువుతున్న విద్యార్థుల ఫీజు బారాలు తగ్గించాలని, కరెంటు చార్జీలు తగ్గించాలని, నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, డీఎస్సీ త్వరగా అమలు అమలు చేసి పెండింగ్లో ఉన్న టీచర్ పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని, స్కూల్ తెరిచే సమయానికి తల్లికి వందనం పథకం అమలు చేయాలని, ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పున ప్రారంభించాలని తదితర డిమాండ్ల సాధనకై ఈ సిపిఐ ప్రచార జాత జరుగుతున్నదని ఈ ప్రసార జాతలో సిపిఐ జిల్లా నాయకులు కేశవరపు అప్పలరాజు, AIYF జిల్లా కార్యవర్గ సభ్యులు. S.సూరిబాబు, మడగల రమణ, పెద్దిరెడ్డి అర్జున్ రావు, నమ్మి సత్యనారాయణ ,అడపా చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


