సంతాపం వ్యక్తం చేసిన సిపిఐ, ఏఐటియుసి నాయకులు.
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమ కారుడు మునీర్ మరణం పట్ల సిపిఐ, ఏఐటియుసి నాయకులు మడ్డి ఎల్లా గౌడ్, కే.స్వామి, ఆరెల్లి పోషం, గౌతం గోవర్ధన్, గోసిక మోహన్, కె.కనకరాజ్, ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేశ్ కుమార్ లు ఒక సంయుక్త ప్రకటన లో సంతాపం వ్యక్తం చేశారు. వామ పక్ష భావజాలం కల్గిన మునీర్ కోల్ బెల్ట్ ప్రాంత ప్రజల, కార్మికుల సమస్యల పై, దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల పై నిరంతరం విశ్లేషణ చేస్తూ వివిధ పత్రికల్లో వ్యాసాలు రాస్తూ మెప్పు పొందారని వారు పేర్కొన్నారు. సింగరేణి ఉద్యోగుల
సమస్యలపై ఎన్నో సార్లు తన కలం ద్వారా వెలుగులోకి తెచ్చిన ప్రముఖ పాత్రికేయుడని వారు కొనియాడారు. మునీర్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ ఒమేగా హాస్పిటల్ లో శనివారం రాత్రి మరణించడం సింగరేణి ప్రాంత వాసులకు తీరని లోటని వారు తెలిపారు. మునీర్ కుటుంబ సభ్యులకు వారు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


