త్రినేత్రం న్యూస్ ములుగు జిల్లా ప్రతినిధి.. ములుగు జిల్లా లో తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క – సారలమ్మలను ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటియుసి అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా మరియు భార్య రామ సాధన మరియు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ… ములుగు జిల్లాలో మేడారం జాతర కుంబమేళను తలపించేలా ఉందని అన్నారు. ప్రజలు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలని మరియు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు 100% గ్రాఫ్ శాలరీ ఇవ్వడం జరిగింది.
మొన్న జీవో రిలీజ్ చేశారు అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా నేషనల్ హెల్త్ మిషన్ లో ఉద్యోగులు అందరికి 100 పర్సెంట్ గ్రాస్ శాలరీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటూ ,సమ్మక్క సారలమ్మ తల్లులను కోరడం జరిగింది.
జంపన్న వాగులో తల స్నానం చేసి , రామ రాజేష్ ఖన్నా అమ్మవార్లకు బెల్లం , ఒడి బియ్యం, చీరలు సమర్పించడం జరిగిందని పేర్కొన్నారు.. మేడారంలో సమ్మక్క – సారమ్మ మొక్కులుగా చెల్లించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో లో బంధువులు పరికిపండ్ల రాజ్యలక్ష్మి, మామిడాల శ్యామ్, గాయత్రి , ప్రియాంక, హర్షవర్ధన్ , రామ శ్రీ హర్ష ,రామ ధనవర్షనీ మరియు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


