త్రినేత్రం న్యూస్: జనవరి 31 నెల్లూరు జిల్లా: కావలి.. నెల్లూరు జిల్లా, కావలి పట్టణం కో-ఆపరేటివ్ కాలనీలోని నలంద స్కూల్లో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి ,ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే ,కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీవిద్యార్థులు, వార్డు నాయకులు, పేరెంట్స్ ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఎమ్మెల్యే , విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ స్టాల్స్‌ను పరిశీలించి, ప్రతి ప్రాజెక్ట్ గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆలోచనా శక్తి, సృజనాత్మకతను ప్రశంసిస్తూ వారిని హృదయపూర్వకంగా అభినందించారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, విద్యార్థులే దేశ భవిష్యత్తు అని, చిన్న వయస్సులోనే శాస్త్ర విజ్ఞానంపై ఆసక్తి పెంపొందించుకోవడం ఎంతో అవసరమన్నారు.
ఇలాంటి సైన్స్ ఫెయిర్ కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ఆవిష్కరణాత్మక ఆలోచనలను పెంపొందిస్తాయని తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమం విద్యార్థుల ఉత్సాహం, ప్రతిభతో ఉత్సవ వాతావరణంలో సాగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


