దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్, కేతావత్ భిల్యా నాయక్.
దేవరకొండ డివిజన్ డిసెంబర్ 27 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో బిఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన సర్పంచ్ ల సన్మాన కార్యక్రమం లో బిఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ , కేతావత్ భిల్యా నాయక్ లు పాల్గొని నూతన సర్పంచ్ లను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు .
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో మనకు మంచి భవిష్యత్తు వుంటుందని, మళ్ళీ కేసిఆర్ ప్రభుత్వం రాబోతుందని, అందరికీ అందుబాటులో వుండి ప్రజల మన్ననలు పొందాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో వడ్త్య రమేష్ నాయక్,కడారి అంజయ్య యాదవ్, గాజుల ఆంజనేయులు, మండల అధ్యక్షులు దస్రు నాయక్,రమేష్ నాయక్,తులసి రాం నాయక్, అభిషేక్, వివిధ గ్రామాల బిఆర్ఎస్ సర్పంచ్ లు, పార్టీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


