దేవరకొండ డివిజన్ డిసెంబర్ 27 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణానికి చెందిన ముప్తి జావిద్ హుస్సేన్ మృతి సమాజానికి తీరని లోటని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పేర్కొన్నారు.
శనివారం దేవరకొండ పట్టణంలోని రాయల్ పంక్షన్ హాల్ లో జరిగిన ముప్తి జావిద్ హుస్సేన్ సంస్కరణ సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ….యాభై సంవత్సరాలుగా దేవరకొండలో ముప్తి జావిద్ హుస్సేన్ ఎనలేని సేవలు అందించారని ఆయన గుర్తు చేశారు.
అందరితో ఆప్యాయంగా ఉంటూ తెలంగాణ,కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో తనదైన శైలిలో సేవలందించారని ఆయన కొనియాడారు. దేవరకొండ ప్రాంతం ముఖ్యంగా ముస్లిం సమాజం పెద్ద దిక్కును కోల్పోయిందని ఆయన అన్నారు.
ఆయన వెంట బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్యా నాయక్,స్థానిక బిఅర్ఎస్ నాయకులు వాజిద్ పాషా,మహ్మద్ ఇలియాస్ పటేల్, మహ్మద్ ఖాదర్ బాబా, మహ్మద్ అఫ్రోజ్, మహ్మద్ జాఫర్, మహ్మద్ నజీర్, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


