దేవరకొండ ఏప్రిల్ 16 త్రినేత్రం న్యూస్. ఈ నెల 27 తేదీన జరగనున్న బి ఆర్ ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ ముఖ్య కార్య కర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు ,దేవర కొండ మాజీ ఎం ఎల్ ఏ రామావత్ రవీంద్ర కుమార్, పాల్గొని ప్రసంగించారు. జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణా జలాలను 72 శాతం చంద్రబాబు ఆంధ్రకు వాడుకున్నాడు. చేతకాని తెలంగాణ ప్రభుత్వం 24% కూడా వాడలేదు.
కృష్ణా జలాలను చంద్రబాబు వాడుకుంటున్న జిల్లా మంత్రులు ఎవరు నోరుమెదపడం లేదు. కృష్ణా జలాల గురించి టిఆర్ఎస్ పార్టీ నాయకులు మొత్తుకున్నా పట్టించుకునే వారు లేరు. కొట్లాడి. తెచ్చుకున్న తెలంగాణ తిరిగి ఆంధ్ర వాళ్ల చేతుల్లోకి పోతుంది. పంచుకోవడం తప్ప అభివృద్ధి మీద సోయిలేని ఈ ప్రభుత్వం రుణమాఫీ చేయకపోయినా రైతుబంధు ఇవ్వకపోయినా బ్యాంకు అప్పులు కూడా పుట్టకుండా పాలిస్తున్న చేతగాని తెలంగాణ ప్రభుత్వం. కాలేశ్వరం ఎండిపోతున్న చలనంలేని ప్రభుత్వం. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మార్చాలని కేసీఆర్ ను కోరుతున్నారు కేసీఆర్ ప్రభుత్వం రావాలని ప్రజలే కోరుతున్నారు.
కాంగ్రెస్ అడ్డగోలు హామీలు మాయమాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చింది. తెలంగాణ వచ్చుడో, కెసిఆర్ సచ్చుడో అని చెప్పి, తెలంగాణ సాధించి తెచ్చిన కేసీఆర్ మీదే ప్రజల ఆశలు నమ్మకం. బంగారు తెలంగాణ కోసం ఎన్నో అద్భుతమైన పథకాలు పెట్టి న ఘనత కెసిఆర్ కే దక్కుతుంది. కెసిఆర్ పెట్టిన పథకాలు ఇప్పుడు ఎందుకు అమలు కావడం లేదని ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుతున్నారు. కాంగ్రెస్ మోసగాల్ల పార్టీ ,డిల్లి గులముల పార్టీ, ప్రభుత్వం కమిషన్లు వచ్చే పనులే చేస్తుంది.
ఎవరైనా నిలదీసి అడిగితే కేసులు పెడతామనుకున్న ప్రభుత్వానికి ప్రజలు తిరుగుబాటు చేస్తే పతనమే, ప్రజల ఆగ్రహం ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ నుండి పారిపోవడం ఖాయం,నాయకులు ఇష్టం వచ్చినట్టు మాటలు, బూతు మాటలు మాట్లాడి అబాసు పాలు అవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడం చేతకాని ప్రభుత్వం, స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే ఓడిపోతామని భయం టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడతారని ఎన్నికలు పెట్టడం లేదు.
రాక్షస పాలన నరకాసుర పాలన కొద్ది రోజులే అని. వచ్చే రోజులు మనవే అని వచ్చేది మన తెలంగాణ బిఆర్ఎస్ ప్రభుత్వమే అని, ఇప్పుడు ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని ఇబ్బందుల గురిచేసిన, ఓపికతో సౌమ్యంగ ఉండాలని, ఎవరు ఆ ధైర్యపడవద్దని, ధైర్యంగా ముందుకు సాగాలని, బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈనెల 27న వరంగల్ లో జరగనున్న బిఆర్ఎస్ రజథోత్సవ సభకు సకాలంలో చేరుకునేలా అందరూ సిద్ధం కావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, వర్త్య రమేష్ నాయక్, బిల్య నాయక్, టీవీ ఏం రెడ్డి, కంకణాల వెంకట్ రెడ్డి, వివిధ మండలాల మండల పార్టీ అధ్యక్షులు, మాజీ జెడ్పిటిసి లు, మాజీ ఎంపీటీసీ లు, పిఎసిఎస్ చైర్మన్లు, ఎంపీపీలు, మాజీ సర్పంచ్లు, వార్డ్ మెంబర్లు, వివిధ హోదాలో ఉన్న, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు,తది తరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


