New Helpline Number : మహిళల భద్రతకు కొత్త హెల్ప్‌లైన్ నంబర్ ‘14490’ ప్రారంభం

TRINETHRAM NEWS

Trinethram News : దేశంలో మహిళలపై పెరుగుతున్న వేధింపులు, అఘాయిత్యాలను దృష్టిలో ఉంచుకొని జాతీయ మహిళా కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల భద్రత కోసం 24 గంటలు అందుబాటులో ఉండే కొత్త హెల్ప్‌లైన్ నంబర్ 14490ను ప్రారంభించింది. హింస, వేధింపులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలు వెంటనే ఈ నంబర్‌కు కాల్ చేసి సహాయం పొందవచ్చు. న్యూఢిల్లీలోని కార్యాలయం నుండి పనిచేసే ఈ హెల్ప్‌లైన్, బాధిత మహిళలను పోలీసు, ఆసుపత్రులు, న్యాయ అధికారులు వంటి సంబంధిత అధికారులతో అనుసంధానిస్తుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

New helpline number '14490' launched for women's safety

You cannot copy content of this page

Scroll to Top