త్రినేత్రం న్యూస్ :నవంబర్ 25: నెల్లూరు జిల్లా :కావలి నియోజకవర్గం. నేడు జలదంకి మండలంలో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ లు, పర్యటించనున్నట్లు మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ మునగాల తిరుమలరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. చిన్నక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అవుట్ ఫ్లో వద్ద నుంచి జలదంకి కావలి మండలాల రైతాంగానికి అవసరమైన సాగునీటిని విడుదల చేస్తారని అన్నారు.
అనంతరం అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొంటారు అన్నారు. ఈ కార్యక్రమాలకు మండలంలోని కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు అభిమానులు సంబంధిత శాఖల అధికారులు రైతులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


