AITUC : పారిశుద్ధ కార్మికుల జీతాలు మంజూరు బిల్లులో అధికారుల నిర్లక్ష్యం

TRINETHRAM NEWS

అధికారులపై చర్యలు తీసుకోవాలి.

కాకినాడ స్పెషల్ సానిటేషన్ కార్మికుల బకాయి జీతాలు తక్షణమే చెల్లించాలి…

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, కాకినాడ,జూన్,09: ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఏఐటీయూసీ, అనుబంధ సంఘ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నిరసన ధర్నా. ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. ప్రసాద్ ఈ ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ లో (ఆప్కాస్) పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్న కార్మికులకు మే నెల లో జీతాలు సగం సగం మాత్రమే పడ్డా యని, పారిశుద్ధ్య కార్మికులను చులకనగా చూస్తూవారికి మస్తర్లు వేయడంలో సచివాలయ హెల్త్ సెక్రటరీ లు, ఇన్స్పెక్టర్ అలసత్వం వహించడం వల్ల, కేవలం వారి నిర్లక్ష్యం వల్ల వారికి జీతాలు తక్కువ పడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కార్పొరేషన్ అధికారులు మరలా బిల్లు పెట్టినఅది వస్తాయో రాయో సమాచారం కూడా తెలియదని మున్సిపల్ కార్యాల చుట్టూ ప్రదర్శన చేయవలసి వస్తుందని వస్తుందని, బిల్లులో అలసత్వం వహిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ,ముఖ్యంగా 12, 14 సర్కిల్లో పనిచేస్తున్న సచివాలయ హెల్త్ సెక్రటరీలు , ఇన్స్పెక్టర్ పై చర్యలు తీసుకుని వారి జీతాల నుండి రికవరీ చేసి కార్మికులకు జీతాలు మంజూరు చేయాలని ఆయన అన్నారు. కాకినాడ స్పెషల్ గా సానిటేషన్ గా పనిచేస్తున్న కార్మికులకు 4 నెలలుగా జీతాలు మంజూరు కాలేదని, జీతాలు సకాలంలో మంజూరు లేక కార్మికులు అప్పులఇబ్బందులకు గురవుతున్నారని, కాకినాడ నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ గారి జోక్యం చేసుకొని తక్షణమే స్పందించి వారికి జీతాలు మంజూరు చేయాలని ఆయన అన్నారు. పర్మనెంట్ ఎంప్లాయిస్ కి యూనిఫామ్, రైన్ కోట్స్, సబ్బులు, నూనెలు మంజూరు చేయాలని, సర్వీస్ పే స్కేల్ అమలు చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బంగారు రాజేష్, జనపల్లి అప్పన్న, కటారి నాగేశ్వరరావు, కే రవీంద్ర, నాగేశ్వరరావు, సింగంపల్లి దుర్గ, గాది వరలక్ష్మి, ఎం అప్పారావు, లండ కావయమ్మ, దుర్గాప్రసాద్ తదితర సభ్యులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Negligence of officials in

You cannot copy content of this page

Scroll to Top