MLA Jogeswara Rao : సామాజిక నేత్ర వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జోగేశ్వరరావు, వేగుళ్ళ లీలాకృష్ణ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట మండలం, ఏడిద సీతానగరం గ్రామంలో కూటమి నాయకులు ఆధ్వర్యంలో, ఎల్.వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞానా సంస్థ వారి సౌజన్యంతో సోమవారం సామాజిక నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, రాష్ట్ర నీటి పారుదల అభివృద్ది సంస్థ చైర్మన్ వేగుళ్ళ లీలాకృష్ణ, ప్రారంభించారు. కూటమి నాయకులు వారికి పూలమాలలు వేసి, శాలువా కప్పి సత్కరించారు.

తొలుత వైద్యులు ఎమ్మెల్యే జోగేశ్వరరావు,కి, వేగుళ్ళ లీలాకృష్ణ,కి కంటి పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీతానగరం వంటి మారుమూల గ్రామాల్లో ఇటువంటి వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. నిపుణులైన కంటి వైద్యులుచే కంటికి సంభందించిన శస్త్ర చికిత్సలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామస్తులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Jogeswara Rao, Vegulla Leelakrishna

You cannot copy content of this page

Scroll to Top