Workers’ Strike : కార్మికుల సమ్మె

TRINETHRAM NEWS

తేదీ : 20/05/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు మరోసారి సమ్మెకు దిగడం జరిగింది. ఇటీవల విధుల నుంచి తొలగించినటువంటి కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇకపై ఏ ఉద్యోగిని విధుల నుంచి తొలగించబోమని సంబంధిత యాజమాన్యం హామీ ఇవ్వాలని అంటున్నారు. ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయాలి, సకాలంలో వేతనాలు చెల్లించాలి, అని కార్మికులు కోరుకుంటున్నారు. బుధవారం వరకు ఈ సమ్మె కొనసాగిస్తామని పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Workers' strike

You cannot copy content of this page

Scroll to Top