అల్లూరిజిల్లా(అరకులోయ) త్రినేత్రం న్యూస్ జులై 27 : అల్లూరిజిల్లా, అరకు వ్యాలీ మండలం, శిరగం పంచాయతీ పరిధిలోని నడిమివలస గ్రామంలో స్కూల్ లేకపోవడంతో చిన్నారులు రోజూ రెండు కిలోమీటర్లు నడిచి బడికి వెళ్లాల్సి వస్తోంది. వర్షాకాలంలో ఈ పరిస్థితి మరింత కష్టాలను కలిగిస్తోందని ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి ఎస్. ఐసుబాబు తెలిపారు.
వర్షాల కారణంగా పిల్లలను బడికి పంపించేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. “మాకు ఒక్క స్కూల్ కావాలి” అంటూ వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని ఎస్ఎఫ్ఐ ఆరోపించింది.
తక్షణమే స్పందించి నడిమివలసలో బడిని నిర్మించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని ఎస్ఎఫ్ఐ హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


