Trinethram News : Andhra : కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని కాంట్రాక్ట్ కార్మికులు ఈ నెల 22 అర్ధరాత్రి నుంచి సమ్మె చేయనున్నట్లు ట్రేడ్ యూనియన్ ప్రకటించింది. జీతాలు పెంచాలని ప్రభుత్వానికి ఎన్నో వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదని పేర్కొంది. తమ డిమాండ్లు నెరవేర్చాలని 38 రోజులుగా నిరసనలు తెలుపుతున్నామంది. ఉన్నతాధికారులతో రెండు సార్లు జరిపిన చర్చలు విఫలమైనట్లు తెలిపింది. దీంతో సమ్మెకు పిలుపునిచ్చినట్లు వివరించింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


