Mumbai to Dubai Train : ముంబై టూ దుబాయ్ ట్రైన్

TRINETHRAM NEWS

రెండు గంటలే ప్రయాణం.

Trinethram News : భారతదేశం – యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) మధ్య సరికొత్త రవాణా విప్లవం రాబోతోంది! ముంబై నగరాన్ని దుబాయ్ నగరంతో అనుసంధానిస్తూ, అరేబియా సముద్రం అడుగున 2,000 కిలోమీటర్ల పొడవైన హై-స్పీడ్ నీటి అడుగున రైలు మార్గాన్ని నిర్మించే ఒక సంచలనాత్మక ప్రాజెక్ట్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

యుఎఇకి చెందిన నేషనల్ అడ్వైజర్ బ్యూరో లిమిటెడ్ (NABL) ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సారథ్యం వహిస్తోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే, ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం కేవలం రెండు గంటలకు తగ్గిపోతుంది!

గంటకు 600 నుండి 1,000 కిలోమీటర్ల వేగంతో.
ఈ ప్రతిపాదిత నీటి అడుగున రైలు, హైపర్‌లూప్ వ్యవస్థను పోలిన అధునాతన సాంకేతికతను ఉపయోగించుకుంటుంది. గంటకు 600 నుండి 1,000 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఈ రైలు, ఇండియా – యుఎఇ మధ్య కనెక్టివిటీని గణనీయంగా పెంచుతుంది. సాంప్రదాయ విమాన ప్రయాణానికి ఇది ఒక వేగవంతమైన, సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.

ఇంజనీర్లకు అనేక సవాళ్లు..
ప్రయాణీకుల రవాణాతో పాటు, ఈ ప్రాజెక్ట్ ముడి చమురు, నీటి వంటి వస్తువుల రవాణాను కూడా సులభతరం చేస్తుంది. తద్వారా ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడతాయి. ఆర్థిక , లాజిస్టికల్ అవసరాలను తీర్చగల సామర్థ్యం ఈ ప్రాజెక్ట్ సొంతం.

ఇది ద్వంద్వ ప్రయోజనాలతో కూడిన సమర్థవంతమైన నమూనాగా రూపొందించబడింది. ఇంజనీర్లకు అనేక సవాళ్లు.. అయితే, 2,000 కిలోమీటర్ల పొడవైన సముద్ర గర్భంలో సొరంగం నిర్మించడం అనేది ఇంజనీర్లకు అనేక సవాళ్లను విసురుతుంది. ఈ ప్రాజెక్టుకు అపారమైన నిధులు అవసరం అవుతాయి. ఈ ప్రాజెక్ట్ కేవలం రెండు నగరాలను కలపడమే కాదు, రెండు దేశాల భవిష్యత్తును, ప్రపంచ రవాణా ముఖచిత్రాన్ని కూడా మార్చే శక్తిని కలిగి ఉంది. ఇది కల నిజమయ్యే రోజు కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది!
ముంబై టూ దుబాయ్ (Mumbai to Dubai) ట్రైన్..రెండు గంటలే ప్రయాణం.

భారతదేశం – యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) మధ్య సరికొత్త రవాణా విప్లవం రాబోతోంది! ముంబై నగరాన్ని దుబాయ్ నగరంతో అనుసంధానిస్తూ, అరేబియా సముద్రం అడుగున 2,000 కిలోమీటర్ల పొడవైన హై-స్పీడ్ నీటి అడుగున రైలు మార్గాన్ని నిర్మించే ఒక సంచలనాత్మక ప్రాజెక్ట్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

యుఎఇకి చెందిన నేషనల్ అడ్వైజర్ బ్యూరో లిమిటెడ్ (NABL) ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సారథ్యం వహిస్తోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే, ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం కేవలం రెండు గంటలకు తగ్గిపోతుంది!

గంటకు 600 నుండి 1,000 కిలోమీటర్ల వేగంతో.
ఈ ప్రతిపాదిత నీటి అడుగున రైలు, హైపర్‌లూప్ వ్యవస్థను పోలిన అధునాతన సాంకేతికతను ఉపయోగించుకుంటుంది. గంటకు 600 నుండి 1,000 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఈ రైలు, ఇండియా – యుఎఇ మధ్య కనెక్టివిటీని గణనీయంగా పెంచుతుంది. సాంప్రదాయ విమాన ప్రయాణానికి ఇది ఒక వేగవంతమైన, సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.

ఇంజనీర్లకు అనేక సవాళ్లు..
ప్రయాణీకుల రవాణాతో పాటు, ఈ ప్రాజెక్ట్ ముడి చమురు, నీటి వంటి వస్తువుల రవాణాను కూడా సులభతరం చేస్తుంది. తద్వారా ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడతాయి. ఆర్థిక , లాజిస్టికల్ అవసరాలను తీర్చగల సామర్థ్యం ఈ ప్రాజెక్ట్ సొంతం.

ఇది ద్వంద్వ ప్రయోజనాలతో కూడిన సమర్థవంతమైన నమూనాగా రూపొందించబడింది. ఇంజనీర్లకు అనేక సవాళ్లు.. అయితే, 2,000 కిలోమీటర్ల పొడవైన సముద్ర గర్భంలో సొరంగం నిర్మించడం అనేది ఇంజనీర్లకు అనేక సవాళ్లను విసురుతుంది. ఈ ప్రాజెక్టుకు అపారమైన నిధులు అవసరం అవుతాయి. ఈ ప్రాజెక్ట్ కేవలం రెండు నగరాలను కలపడమే కాదు, రెండు దేశాల భవిష్యత్తును, ప్రపంచ రవాణా ముఖచిత్రాన్ని కూడా మార్చే శక్తిని కలిగి ఉంది. ఇది కల నిజమయ్యే రోజు కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది!

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Mumbai to Dubai Train

You cannot copy content of this page

Scroll to Top