తేదీ : 28/04/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం లో ఉన్నటువంటి సెయింట్ థెరిస్సా ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు బాలికలు పదవ తరగతి ఫలితాల్లో కొంగల నవ్యశ్రీ ఐదు వందల డెబ్బై ఐదు మార్కులతో టా పర్ గా నిలిచింది. అదేవిధంగా గోలి . కీర్తన రెడ్డి ,ఐదు వందల ఇరవై వేడు మార్కులు సాధించింది. దగ్గుల. యోగేంద్ర సాయి తేజ ఐదు వందల రెండు మార్కులతో పాఠశాల ప్రతిభను చూపించారు.
సమయం ప్రకారం తరగతులు, అదేవిధంగా వసతి గృహంలో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ వంటివి జరుగుతున్నాయని, స్టడీ అవర్స్ కూడా పెడుతున్నారని తెలిపారు. చదువులో భాగంగానే క్రీడలు కూడా ఆడిస్తున్నారని పేర్కొన్నారు. మండల పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుండి విద్యార్థులు వస్తున్నారని తెలిపారు.
పాఠశాలకు సంబంధించి బస్సులు ఉన్నాయి. సమయం ప్రకారం విద్యార్థులు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్లి పాఠశాలకు తీసుకురావడం పాఠశాల ఆయన అనంతరం మళ్లీ ఇంటికి తీసుకు వెళ్లడం జరుగుతుందని ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు. విద్యార్థుల విజయాన్ని ఆనందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సెయింట్ థెరిస్సా యాజమాన్యం తెలపడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


