యూఏఈలోని అబుదాబిలో నిర్మించిన తొలి హిందూ ఆలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు.
27 ఎకరాల్లో, రూ.700కోట్లతో బీఏపీఎస్ సంస్థ నిర్మించిన ఈ ఆలయాన్ని పశ్చిమాసియాలోనే అతిపెద్ద హిందూ ఆలయంగా పేర్కొంటున్నారు.
262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పు, 108 అడుగుల ఎత్తుతో భారతీయ శిల్పకళా సౌందర్యం ఉట్టిపడేలా ఈ ఆలయాన్ని నిర్మించారు.