*భారత రాష్ట సమితి రజతోత్సవ సభను విజయవంతం చేయాలి – డిండి టౌన్ అధ్యక్షులు మహమ్మద్ రషీద్
డిండి ఏప్రిల్ 26, త్రినేత్రం న్యూస్: రేపు వరంగల్ జిల్లాలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ డిండి టౌన్ అధ్యక్షులు మొహమ్మద్ రషీద్ అన్నారు. నేడు డిండి మండల కేంద్రములో ఆయన మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో ఆదివారము నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నాయకులు వనరులను దోచుకుంటూ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. కెసిఆర్ పదేళ్ల పాలనలో సంక్షేమం అభివృద్ధి తెలంగాణ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు.
రజతోత్సవ సభకు డిండి మండలం నుండి అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


