త్రినేత్రం న్యూస్, మండపేట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నేతృత్వంలోని కమిటీ సభ్యులు విశాఖపట్నంలో రెండు రోజుల పర్యటనను విజయవంతంగా పూర్తి చేశారు. పర్యటనలో రెండవ రోజు ఉదయం 11 గంటలకు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (డీఎంహెచ్‌ఓ) కార్యాలయాన్ని చైర్మన్ తోట త్రిమూర్తులు పరిశీలించారు.
అనంతరం సబార్డినేట్ కమిటీ సభ్యులు కన్నా లక్ష్మీ నారాయణ, బండారు శ్రావణి శ్రీ లు ఆంధ్ర మెడికల్ కాలేజీని సందర్శించి పరిశీలన నిర్వహించారు. తర్వాత కింగ్ జార్జి హాస్పిటల్ (కేజీహెచ్)లో గైనకాలజీ విభాగంతో పాటు వివిధ ఇతర విభాగాలను పరిశీలించారు. చెస్ట్ హాస్పిటల్ నందు కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా హెచ్‌ఐవీ రోగులతో సభ్యులు సంభాషించారు.
ప్రభుత్వ జీవో ప్రకారం ఏర్పాటు చేసిన ప్రత్యేక వసతి సౌకర్యాలు సక్రమంగా అమలవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. హెచ్‌ఐవీ రోగులు సమాజంలో ఎదుర్కొంటున్న వివిధ ఇబ్బందులను కమిటీ సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వానికి ప్రత్యేక నివేదిక పంపాలని చైర్మన్ తోట త్రిమూర్తులు మరియు కమిటీ సభ్యులు సూచించారు.రెండు రోజుల పర్యటనలో జీవోల అమలు సంతృప్తికరంగా ఉందని, సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ సభ్యులు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


