త్రినేత్రం న్యూస్. మండపేట: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ తీవ్రతరం కావడంతో ఆంధ్రప్రదేశ్ తీర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర సభార్డినేట్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సూచించారు. మండపేట నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే మధ్యాహ్నం నుంచి వర్షాలు కురుస్తుండగా, గంటకు 50–60 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, 10–15 సెం.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందని ఆయన తెలిపారు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైసీపీ కార్యకర్తలు సహాయక చర్యల్లో ముందుండాలని త్రిమూర్తులు పిలుపునిచ్చారు.
ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు అన్ని శాఖలు సిద్ధంగా ఉండాలని అధికారులు పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించారు. ప్రత్యేకంగా కపిలేశ్వరపురం, రాయవరం, మండపేట రూరల్, మండపేట టౌన్ ప్రాంతాల ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. విద్యుత్ స్తంభాలు, వైర్లు, చెట్లు వంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రైతులు పొలాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. తుపాను ప్రభావం వల్ల పంటలకు నష్టం తక్కువగా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని త్రిమూర్తులు సూచించారు. వర్షాల ప్రభావం తగ్గి రైతులకు అనుకూలంగా మారాలని ఆయన ఆకాంక్షించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


