త్రినేత్రం న్యూస్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట పట్టణంలో వేంచేసియున్న శ్రీ జనార్ధన శ్రీ అగస్త్యేశ్వర స్వామి వార్ల దేవస్ధానం (రధం గుడి) పునఃనిర్మాణం పనులకు ఆదివారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, కొబ్బరికాయ కొట్టారు. తొలుత ఎమ్మెల్యే వేగుళ్ళ రధం గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ గుడి పున:నిర్మాణ పనులు పర్యవేక్షణకు రధం గుడి కి ప్రతీ రోజు వచ్చే భక్తులతో నిర్మాణ కమిటీని ఏర్పాటు చెయ్యవలసినదిగా ఆలయ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్, పట్టణ టీడీపీ అధ్యక్షులు మచ్చా నాగు, మాజీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్ డైరెక్టర్ గడి సత్యవతి రాంబాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లి గణేష్, 17వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి కాళ్ళకూరి స్వరాజ్య భవాని శ్రీనివాస్, మండపేట పిఎసిఎస్ చైర్మన్ కుక్కల రామారావు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కోన సత్యనారాయణ, జొన్నపల్లి సూర్యరావు, శిరంగి ఈశ్వరరావు, చుండ్రు అగస్త్యరాజు, వాకచర్ల గుప్తా, దుగ్గిరాల సోమశేఖర్, అవసరాల వీర్రాజు, వాదా ప్రసాదరావు, నెల్లిపూడి సత్యనారాయణ, పెదపాటి సత్తిబాబు, శివకోటి శేఖర్, శెట్టి రవి, చుండ్రు సోమరాజు, నామాల చంద్రరావు, కాళ్ళకూరి గొల్లబాబు, అల్లక శ్రీనివాస్, కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు, తదితర్లు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


