జూన్ 27, 2026
TRINETHRAM NEWS

ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కుటమి లక్ష్యం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మండపేట టిడ్కో అపార్ట్ మెంట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

అవసరమైన సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కమీషనర్ టీవీ రంగారావు కు సూచించారు. ఈ కార్యక్రమంలో మండపేట మున్సిపల్ చైర్మన్ పతివాడ రాణి, మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్, మున్సిపల్ డీఈ శ్రీనివాస్, ఏఈ లు ఆంజనేయులు, పవన్ కుమార్, 6వ వార్డు కౌన్సిలర్ కాశిన కాశీ విశ్వనాథం, మండపేట మార్కెట్ కమిటి డైరెక్టర్ డైరెక్టర్ మేడింటి సూర్య ప్రకాశరావు, టిడిపి నాయకులు సిరంగు ఈశ్వరరావు, టేకి వెంకట రమణ, కురసాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Mandapet MLA Vegulla inaugurated

You cannot copy content of this page