1954 నుండి2009 వరకు ఆర్ఓఆర్,పహానిలు,పట్టా పుస్తకాలు కలిగిన భూములు
ఇరిగేషన్ శాఖపై తప్పుగా నమోదైన సొంత వారసత్వ వ్యవసాయ భూముల సమస్యను త్వరగా పరిష్కరించాలి.
16 సంవత్సరాలుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు,బ్యాంకు లోన్లకు నోచుకోని 450 ఎకరాల వ్యవసాయ భూములు.
మా భూములకు త్వరగా కొత్త పట్టా పాసుపుస్తకాలు ఇవ్వాలి:-బాధిత రైతులు
డిండి (గుండ్ల పల్లి) జూన్16 త్రినేత్రం న్యూస్.. నల్లగొండ జిల్లా (గుండ్లపల్లి) డిండి మండల కేంద్రంలోని రెవెన్యూ గ్రామ శివారులో గల పట్టా కలిగిన సొంత వారసత్వ వ్యవసాయ భూములను గతంలో ఇరిగేషన్ శాఖ పేరున తప్పుగా నమోదైన దాదాపు 450 ఎకరాల వ్యవసాయ భూములను తిరిగి రైతుల పేరున బదలాయించాలని స్థానిక ఎమ్మార్వో ఆఫీసు ముందు ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టి, కార్యాలయంలో దరఖాస్తు సమర్పించారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఇరిగేషన్ శాఖ పేరు మీద తప్పుగా నమోదైన సొంత వారసత్వ వ్యవసాయ భూములని రైతులు తెలిపారు.16 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వ పథకానికి,బ్యాంకు లోన్లకు నోచుకోని దాదాపు 450 ఎకరాల వ్యవసాయ భూముల సమస్యను త్వరగా పరిష్కరించాలని రైతులు కన్నీటి పారవశ్యవంతమై తెలిపారు.
ఆపద సమయంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని,ఇట్టి భూ సమస్యలను త్వరగా పరిష్కరించి కొత్త పట్టా పుస్తకాలు ఇప్పించాలని కోరారు.తమ భూములు తమ పేరు మీదికి బదలాయించేంతవరకు నిరసనలు,నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.త్వరగా తమ భూ సమస్యలను పరిష్కరించి పదహారేండ్ల తమ నిరీక్షణకు స్వస్తి పలకాలని సంబంధిత అధికారులను,రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధిత రైతులు ఈ సందర్భంగా వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో బాధిత రైతులు నల్లగంతుల రవి,ఐలేష్ చారి, కాయితి శేఖర్ రెడ్డి,కాంపల్లి గెల్వయ్య,మూడావత్ కిషన్, చంద్రయ్య,వంగాల విమలమ్మ, తుమ్మల రేవతమ్మ,తుమ్మల అమరావతి,కాసుల పుష్పమ్మ, కాసుల మేఘమాల,కాసుల సుదర్శనమ్మ,నల్లగంతుల శోభ,సడంపల్లి లింగమ్మ,వంగాల వకుల, తుమ్మల నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


