
MLA Songa Roshan : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూలై 29 ; జిల్లా కలెక్టరేట్ లో జరిగినటువంటి 20 అంశాల పథకం సమీక్ష సమావేశంలో చింతలపూడి, దెందులూరు నియోజకవర్గాల డైనమిక్ శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్, చింతమనేని ప్రభాకర్, జిల్లా కలెక్టర్ కె వె ట్రి సెల్వి పాల్గొన్నారు.
కేంద్రం ప్రజా సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలను చింతలపూడి నియోజకవర్గంలో సమర్థవంతంగా అమలు చేసేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా యంత్రాంగం కూడా సహకరించాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ కోరారు. ఆరోగ్య సంబంధమైన పథకాల అమలు విషయంలో ప్రభుత్వ వైద్యశాలలో ప్రసవాలు అధికంగా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు.. అందుకు డి ఎం. హెచ్ ఓ మరియు డి సి హెచ్ ఎస్ , వైద్యాధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.
పాఠశాల విద్యార్థులకు ఆర్బిఎస్కే కార్యక్రమం ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి అందుకు సంబంధించిన పొందుపరిచిన హెల్త్ కార్డులను మెగా పేటీఎం లలో పంపిణీ చేయాలని సూచించారు . అమృత్ పథకం ద్వారా చింతలపూడి , జంగారెడ్డిగూడెం పట్టణాల్లో త్రాగునీరు అందించే కార్యక్రమం కొనసాగుతున్నట్టు ఎమ్మెల్యే రోషన్ కుమార్ పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe