ఆగస్ట్ 31, 2026
TRINETHRAM NEWS
MLA Satyananda Rao

వద్దిపర్రులో జరిగిన రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

రూ.65 లక్షల నిధులతో నిర్మించిన వాటర్ ట్యాంకును ప్రారంభించిన ఎమ్మెల్యే…

గ్రామంలో రెండేళ్లలో జరిగిన పనులను వివరించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు…

MLA Satyananda Rao : త్రినేత్రం న్యూస్ : రాష్ట్ర అభివృద్ధి, గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. సోమవారం ఆత్రేయపురం మండలం వద్దిపర్రులో రెండేళ్ల కూటమి ప్రభుత్వం నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మొదటగా గ్రామంలో జలాజీవణ్ మిషన్ ద్వారా రూ.65 లక్షలతో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంకును ప్రారంభించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి గత రెండేళ్లలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించి కరపత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందన్నారు. సామాజిక భద్రతా పింఛన్ల పెంపు, అన్నదాత సుఖీభవ, దీపం 2 పథకం, తల్లికి వందనం, స్త్రీ శక్తి తదితర సంక్షేమ పథకాలను అందిస్తున్న విషయాన్ని ప్రజలకు వివరించారు. వైసీపీ పాలనలో అరాచకం రాజ్యమేలితే కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందన్నారు. గత రెండేళ్లలో ఒక్క వద్దిపర్రు గ్రామంలోనే సంక్షేమ పథకాల అమలుతో పాటు ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు.అన్నదాత సుఖీభవ కింద గ్రామంలోని రైతులకు రూ.68.04 లక్షలు అందజేయడం జరిగిందన్నారు.

ఆటో డ్రైవర్లు 12 మంది ఉంటే వారికి రూ.1.80 లక్షలు అందజేయడం జరిగిందన్నారు. మారిశెట్టివారిపాలెం ఆర్ అండ్ బి రోడ్డు నుంచి బీటీ రోడ్డు రూ.40 లక్షలతో పూర్తి చేశామన్నారు. రూ.50 లక్షలతో ఆర్ అండ్ బి రోడ్డు నుంచి రజక పేట వరకు బీటీ రోడ్డును నిర్మించామన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ.15 లక్షలతో సిసి రోడ్డు నిర్మించడం జరిగిందన్నారు. పంచాయతీ నుంచి ఏటిగట్టు వరకు రూ.50 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మించామన్నారు. రూ.1.90 లక్షలతో చేతిపంపుల ఏర్పాటు జరిగిందన్నారు. రూ.65 లక్షలతో వాటర్ ట్యాంకు పూర్తి చేశామన్నారు.

అంతర్గత సీసీ రోడ్లు రూ.5 లక్షలతో పూర్తి చేసామన్నారు. డ్రైనేజీలు సైతం రూ.15 లక్షలతో నిర్మించామన్నారు. గోకులాలు సైతం నిర్మించామన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సైతం నిధులు గ్రామంలో ఎక్కువ మందికి అందజేశామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్కరు కూడా ముఖ్యమంత్రి సహాయనిధి పొందిన వాళ్లు లేరన్నారు. రూ. 35 లక్షలతో ధవలేశ్వరం బ్యారేజీ పై రోడ్డు నిర్మించడం జరిగిందన్నారు. బ్యారేజ్ ఉనికే కోల్పోయే స్థితిని వైసీపీ ప్రభుత్వం తీసుకొస్తే, కూటమి ప్రభుత్వంలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి గేట్ల మరమ్మత్తు పనులకు శ్రీకారం చుట్టారన్నారు.వద్దిపర్రు మెయిన్ రోడ్ సిమెంట్ రోడ్డు గా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page