
Pawan Kalyan : గుంటూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 10 ; నెల్లూరులో వైసిపి నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమం తీరుపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ అవసరాల కోసం దైవాన్ని కొలిచే మంత్రాలను , గోవింద నామాలను, భక్తి గీతాలను పేరడీగా మారుస్తూ అపహాస్యం చేయడం, కించపరచడం తగదని హితవు పలికారు.
అయితే రాష్ట్రంలో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరించొద్దని వైసిపి పార్టీ నాయకులకు సూచించారు. రాష్ట్రంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడడం సరికాదన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe