Regam Matsyalingam : ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం

TRINETHRAM NEWS

అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 10: అరకులోయ టౌన్: ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే. రేగం మత్స్యలింగం అధికారులను సూచించారు. అరకువేలి మండల సర్వసభ్య సమావేశం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు రంజపల్లి ఉష రాణి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో హాజరైన అరకు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే.మత్స్యలింగం మాట్లాడుతూ మండల అధికారులను ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి అధికారులను సూచించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటిస్తూ గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు. పనిచేయాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీ స్త్రీలకు, చిన్న పిల్లలకు, బాలింతలు అందించే పౌష్టిక ఆహారం పూర్తి స్థాయిలో అందించాలని అన్నారు. అలాగే సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించడానికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కృషీ చెయ్యాలని కోరారు. అలాగే అరకులోయ టౌన్ లో నాన్ ట్రైబల్స్ అక్రమంగా నిర్మించిన షాప్ లను వాటిపై ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదని మండల రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. మరియు మండల అధికారులను వారి శాఖల్లో జరిగిన పనుల వివరాలను అడిగి తెలుసుకొని సలహాలు సూచనలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, ఎంపీపీ, తహసీల్దార్, ఎంపిడిఓ, పాటు అరకులోయ మండలం వైస్ ఎంపీపీలు కిల్లో రామన్న , కొర్ర సుమంజలి, మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు పాడి రమేష్ ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Regam Matsyalingam should

You cannot copy content of this page

Scroll to Top